'అండ'లేదు 'బండ' లేదు.. అంటూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్...

అనంతపురం మాజీ ఎంపీ.జెసి దివాకర్ రెడ్డి.

 Jc Diwakar Made Harsh Remarks On Chandrababu Naidu Saying 'no Support No Rock'-TeluguStop.com

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ పాలన చేయాలి అంటూ.చంద్రబాబు నాయుడుపై స్నేహపూర్వకమైన ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగర వేస్తుందని, చంద్రబాబు కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మేమంతా విశ్వసిస్తున్నాము అంటూ అభిప్రాయపడ్డారు.

ఆయన ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సాత్వికుడు, దూరదృష్టి కలవాడు, దుర్మార్గపు ఆలోచనలు చేయడు అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.ఆయన సపోర్టర్స్ అయిన మేము ఆయన గొంతు మీద కత్తి పెట్టి నువ్వు చేస్తావా.

చెయ్యవా.నువ్వు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తా మన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరుగదు, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు జేసి గుర్తు చేశారు.అయితే ఇప్పుడు ‘అండ లేదు బండ లేదు’.

మా నెత్తిన రాళ్ళు పడ్డాయి.మాకు ఇబ్బందులు కలుగ జేసిన వారు, బాధ పెట్టిన వారు చాలామంది ఉన్నారు.

వారిపై కేసులు చూపిస్తాం ఏం యాక్షన్ తీసుకుంటావు.యాక్షన్స్ తీసుకోకపోతే నీ నాయకత్వం మాకు ఎందుకు అంటూ చంద్రబాబు ను ఘాటుగా ప్రశ్నించారు.

ఒకవేళ చంద్రబాబు యాక్షన్స్ తీసుకోకపోతే ఇంకొక మాట అంటాం.అదేదో మూడోరకం అనుకోవాల్సి వస్తుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన మంచితనం కంటే అదేదో మాట అనాల్సి వస్తుంది అన్నారు.పార్టీ కార్యకర్తలకు.

నాయకులకు ఉన్న ఆవేశం, ఆక్రోశం తీరాల్సిందే, అది చంద్రబాబుకు తప్పదు.ప్రస్తుత ప్రభుత్వంలో కార్యకర్తలు దెబ్బ తింటున్నారు, రక్తాలు కారుతున్నాయి.

ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పామన్నారు.ఇక టిడిపి నుండి ఎంతమంది వెళ్ళిపోయినా.

ఎన్టీఆర్, చంద్రబాబుకు మంచి పేరు ఉందని, జగన్ ప్రభుత్వ పాలనకు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనకు తేడా ఉందని ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube