జక్కన్న తర్వాత పారితోషికంలో టాప్ డైరెక్టర్ ఆయనేనా... ఈ డైరెక్టర్ పారితోషికం ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( Director SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు.

 Jawan Movie Director Atli Shocking Remuneration, Jawan Movie ,remuneration, Atli-TeluguStop.com

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి.ఆ తర్వాత విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.

ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు రాజమౌళి.

Telugu Atli, Jawan, Rajamouli-Movie

అంతేకాకుండా ఈ సినిమాకు గాను ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే రాజ‌మౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల ప్యాకేజీతో పాటు లాభాల్లో వాటాలు తీసుకుంటార‌న్న ప్ర‌చారం ఉంది.నిజానికి స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్, ర‌జ‌నీకాంత్, ప్ర‌భాస్ ఇప్ప‌టికే 100 కోట్లు అందుకుంటున్న వారి జాబితాలో ఉన్న‌ట్టు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

ద‌ర్శ‌కుల్లో వంద కోట్ల ప్యాకేజీ అనేది అరుదు.కానీ హీరోల‌కు ధీటుగా టాప్ డైరెక్ట‌ర్స్ పారితోషికాలు అందుకుంటున్నార‌న్న‌ది మాత్రం నిజం.ప‌లువురు ద‌ర్శ‌కులు సుమారు 20- 30కోట్ల‌కు ద‌గ్గ‌రగా పారితోషికాలు అందుకుంటున్నారు.

Telugu Atli, Jawan, Rajamouli-Movie

రాజ్ కుమార్ హిరాణీ, అశుతోష్ గోవారిక‌ర్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, రోహిత్ శెట్టి లాంటి టాప్ డైరెక్ట‌ర్లు భారీ పారితోషికాలు అందుకుంటున్నార‌న్న క‌థ‌నాలు ఉన్నాయి.కానీ రాజ‌మౌళి త‌ర్వాత భారీ పారితోషికం అందుకుంటున్న మ‌రో ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే, ఇప్పుడు సౌతిండియాలోనే మ‌రో పేరు వినిపిస్తోంది.తర్వాత స్థానంలో త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ( Director Atlee ) పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది.

అత‌డికి షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్ దాదాపు 30కోట్ల పారితోషికం ముట్టజెబుతోంద‌ని స‌మాచారం.అందిన సమాచారం ప్రకారం అట్లీ తాను దర్శకత్వం వహించే ప్రతి చిత్రానికి సుమారుగా రూ.52 కోట్లు వసూలు చేస్తాడు.అయితే జవాన్ కోసం తన స్టాండర్డ్ ఫీజును తగ్గించాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

జ‌వాన్ కోసం కేవ‌లం 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube