తెలంగాణలో ఎన్నికల లో పోటీ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan )తీసుకున్న నిర్ణయం జనసేనకు జాతీయ పార్టీ దిశగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలలో పోటీ చేసి నిర్ణీత సంఖ్య కి ఓట్లను తెచ్చుకున్న పార్టీ కి జాతీయ హోదా దక్కుతుంది.
పోటీ చేస్తున్న సీట్లు సాధించిన ఓట్ల శాతాలు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి .తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ కనీసం రెండు నుంచి మూడు స్థానాలను గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో పోరాడుతుంది.సీమాంధ్ర ఓటు బ్యాంకుతోపాటు పవన్ చరిష్మా పై ఆశలు పెట్టుకున్న జనసేన , అభ్యర్థులు బలమైన వారు కాకపోయినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ముఖ్యంగా సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి స్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి జనసేన ( Jana Sena )విశ్వప్రయత్నం చేస్తుంది.ఇక్కడ సెటిలర్ ల ఓట్లు బలంగా ఉండటంతో పాటు ఇంతకుముందు ఆంధ్ర ప్రాంత నేతలు గెలుపొందిన చరిత్ర కూడా ఉండటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూకట్పల్లిలో జెండా పాతాలని జనసేన ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.తద్వారా తెలంగాణ అసెంబ్లీ లో జనసేన ప్రాతినిధ్యం వస్తుందని, తనదైన రాజకీయాన్ని తెలంగాణకు పరిచయం చేయాలని జనసేన పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో పోటీ చేస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా కూడా జనసేన తన ప్రత్యేకతను చాటుకుంటుంది.ఇప్పటివరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసిన ప్రాంతీయ పార్టీ లేదు జనసేన మొదటిసారిగా ఆ ప్రాముఖ్యతను దక్కించుకుంది .అయితే ఆంధ్రప్రదేశ్లో తమకు భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో కూడా తమకు మద్దతు ప్రకటిస్తే జనసేనకు లాభిస్తుందని అంచనాలు ఉన్నా తెలుగుదేశం( Telugudesam party ) మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుంది.ఈ విషయంపై పవన్ చంద్రబాబు( Chandrababu )తో చర్చిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్ గెలవటమే తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిదన్న కోణం లో తెలుగు తమ్ముళ్లు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.