ఉచితంగా టీ పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచిన జనసేన.. గాజు గ్లాస్ గుర్తును ఇలా ప్రమోట్ చేస్తూ?

ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.మార్చి నెలాఖరున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా మే నెలలో ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరిగే అవకాశం ఉంది.

 Janasena Free Tea Publicity Details Here Goes Viral In Social Media,free Tea,pu-TeluguStop.com

టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉంది.జనసేన పార్టీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందనే ప్రశ్నకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

అయితే జనసేన పార్టీ( Janasena Party )కి చెందిన కొంతమంది నేతలు తమ పార్టీ గుర్తును వినూత్నంగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.తాడేపల్లిగూడెంలో జనంలోకి జనసేన టీ గ్లాస్( Janasena Tea Glass ) అంటూ ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నారు. ఉచిత టీస్టాల్స్( Janasena Free Tea Stalls ) ను ఏర్పాటు చేసి జనసేన టీ పంపిణీ చేయడం గురించి స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.స్థానిక నాయకుల ఆలోచన పవన్ అభిమానుల మెప్పు పొందుతోంది.

జనసేన ఈ తరహా ప్రచారం చేయడం ఇదే తొలిసారి కాదు.2019 ఎన్నికల సమయంలో కూడా జనసేన ఇదే తరహాలో ప్రచారం చేసింది.జనంలోకి ఎన్నికల గుర్తును బలంగా తీసుకెళ్లడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని జనసేన భావిస్తోంది.మరోవైపు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్ ఒక స్థానం నుంచి పోటీ చేస్తారో లేక రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారో చూడాలి.

త్వరలో టీడీపీ జనసేన( TDP Janasena ) తొలి జాబితా ప్రకటన రానుందని తెలుస్తోంది.ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టి ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారు.టీడీపీ జనసేన, వైసీపీలలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.

ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తలలు పండిన విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube