వైసీపీ లో ఎమ్మెల్యే టికెట్లు వారికే ? వీరికి నో ఛాన్స్ ?

పలుకుబడి ప్రాధాన్యం ఏదైనా, కొంతవరకే తప్ప ఎప్పుడు అదే కాపాడుతుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే.ఈ విషయం ఇప్పుడే వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అర్థమవుతోంది.

 Jagans Decision To Give More Ycp Mla Tickets To Young Leaders In 2024 Elections-TeluguStop.com

ఎప్పటికప్పుడు జగన్ క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాల పై నిఘా వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు.  ఏ నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి అక్కడ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది గ్రూపు రాజకీయాలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కంటే ఇప్పుడు కాస్త ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది.పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమిటనే విషయం జగన్ ఆరాతీస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతుందని, వారివల్లే ప్రజా వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోందని జగన్ గుర్తించారు.
    ముఖ్యంగా సీనియర్, జూనియర్ నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోవడం వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.

2024 ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే,  ప్రతిపక్షంలో కూర్చోవాలి అనే భయం జగన్ ను వెంటాడుతోంది.అందుకే పార్టీలో ప్రకంపనలు చెలరేగినా పర్వాలేదు అన్నట్లుగానే జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట.

వచ్చే ఎన్నికల్లో దాదాపు 70, 80 స్థానాల్లో సిట్టింగ్ లను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.సీనియర్ నాయకులు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న తీరు, జనాల సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడం, పార్టీ అజెండాలు పక్కనబెట్టి తమ సొంత అజెండాతో ముందుకు వెళుతూ, పార్టీకి నష్టం చేకూర్చుతూ ఉండడం ఎలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
 

Telugu Ap Jagan, Chandrababu, Jagan, Janasena, Mla Tickets, Ysr Cp, Ysrcp, Ysrcp

  మళ్ళీ వారికి టికెట్లు ఇచ్చి పోటీకి దింపితే జనాల్లో వారిపై ఉన్న అసంతృప్తి పూర్తిగా తమపై పడుతుంది అనే అభిప్రాయంలో జగన్ ఉన్నారట.అందుకే ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాల్లో యువ నాయకులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.జగన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఎన్నికల నాటికి ఎన్ని ప్రకంపనలు సృష్టిస్థాయో ?  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube