' ఆడుదాం ఆంధ్రా ' ! జగన్ ఆటకు ప్రత్యర్థుల ముఖచిత్రం ఏంటో ? 

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) రాజకీయ ఆట మొదలుపెట్టారు.తమ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం దొరక్కుండా చేసేందుకు పదునైన వ్యూహాలను అమలు చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు.

 Cm Jagan Gears Up For Aadudam Andhra Programme Details, Ysrcp,ap Government, Aad-TeluguStop.com

ఒకపక్క ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే,  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద మధ్య తరగతి వర్గాలతో పాటు, ఉన్నత వర్గాలను ఆకట్టుకునే విధంగా అనేక పథకాలను ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన( TDP Janasena ) కలిసి వైసిపిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండడంతో, దానికి అనుగుణంగానే  నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వై నాట్ 175 అనే నినాదాన్ని నిజం చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు.  దీనిలో భాగంగానే ఇప్పటికే సామాజిక సాధికార యాత్ర( Samajika Sadhikara Yatra ) పేరుతో బీసీ , ఎస్సీ,  ఎస్టీ  వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మేలు, తదితర అంశాలను వివరించేందుకు మంత్రులు,  ఇతర కీలక ప్రజాప్రతినిధులతో బస్సు యాత్ర చేయిస్తున్నారు.

ఇప్పుడు యువతను ఆకట్టుకునే విధంగా ఆడుదాం ఆంధ్ర( Aadudam Andhra ) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలపై ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.వీటి నిర్వహణ సంబంధించి ఏపీ క్రీడ రాధికార సంస్థ శాప్ కు బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

Telugu Aadudam Andhra, Ap, Cmjagan, Janasena, Ysrcp-Politics

క్రికెట్ , ఖో ఖో , వాలీబాల్, కబడ్డీ, బ్యాట్మింటాన్ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.గ్రామ,  వార్డు,  సచివాలయ మండల ,నియోజకవర్గ జిల్లా రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు జరగనున్నాయి.15 సంవత్సరాలు నిండిన వారంతా దీనికి అర్హులే.గ్రామీణ స్థాయి నుంచి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను( Sports Competitions ) నిర్వహించేందుకు వైసిపి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ కార్యక్రమంలో పార్టీ ,ప్రభుత్వ వర్గాలు పాల్గొనబోతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఈ పోటీలు నిర్వహించనున్నారు దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

ముందుగా సచివాలయ పరిధిలోని క్రీడలపై ఆసక్తి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాల బాలికలకు విడిగా స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు.

Telugu Aadudam Andhra, Ap, Cmjagan, Janasena, Ysrcp-Politics

అలాగే ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ,  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూత్ మద్దతు వైసీపీకి ఉండేలా జగన్ ప్లాన్ చేశారు.ఇప్పటికే మహిళలు చేతువృత్తిదారులు, వృద్ధులు వికలాంగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం , ఇప్పుడు యువతను ఆకర్షించేందుకు వినూత్న పథకాలను రూపొందిస్తూ తిరుగులేని శక్తిగా,  2024 ఎన్నికల్లో విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే వైసిపి ప్రభుత్వం( YCP ) తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలతో ప్రత్యర్థి పార్టీలు మరింతగా వెనకబడే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube