టీడీపీని గట్టెక్కించే ప్లాన్ అదే ?

Is That The Plan To Defeat TDP, Nara Lokesh , Chandrababu Naidu Arrest , Balakrishna , Brahmani Nara, Tdp, Ap Politics, Ycp, Ys Jagan

ప్రస్తుతం టీడీపీ గడ్డుకాలం నడుస్తోంది.అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్( Chandrababu Naidu arrest ) లో అరెస్ట్ కావడంతో పార్టీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది.

 Is That The Plan To Defeat Tdp, Nara Lokesh , Chandrababu Naidu Arrest , Balakri-TeluguStop.com

నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ వంటి వారు పార్టీని ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి

బాబు ప్లేస్

ను రీప్లేస్ చేయలేక పోతున్నారు.మరోవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి.

అధినేత చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.ఇవి చాలదన్నట్లు ఇప్పుడు మరో స్కామ్ కూడా చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది.

ఫైబర్ నెట్ టెండర్ల విషయంలో బాబు అండ్ కో అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సిఐడి ఆరోపిస్తోంది.ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ స్కామ్ లో నారా లోకేశ్ పాత్ర కూడా ఉందని వైసీపీ గట్టిగా నొక్కి చెబుతోంది.

Telugu Ap, Balakrishna, Brahmani, Chandrababu, Lokesh, Ys Jagan-Politics

దీంతో నారా లోకేశ్ కూడా జైలు పాలు( Nara Lokesh ) అయ్యే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.ఇదే గనుక నిజం అయితే టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.టీడీపీ ని నడిపించేందుకు బాలయ్య రెడీగా నే ఉన్నప్పటికి ఆయనపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం లేనట్లు టాక్.ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మిణి, భువనేశ్వరి లను బరిలో దించితే ఎలా ఉంటుందనే ఆలోచన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోందట.

అయితే వారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.అయినప్పటికి వారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కోసం నిలబడితే వచ్చే ఎన్నిటికల్లో టీడీపీ విజయం సాధించడం గ్యారెంటీ అని టీడీపీలోని ఒక వర్గం భావిస్తోందట.

Telugu Ap, Balakrishna, Brahmani, Chandrababu, Lokesh, Ys Jagan-Politics

గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ జైల్లో ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ పార్టీకి తీసుకొచ్చిన మైలేజ్ అందరికీ తెలిసిందే.అన్న జైల్లో ఉన్నాడనే సెంటిమెంట్ గట్టిగా వర్కౌట్ అయ్యి షర్మిల పాదయాత్ర కు బ్రహ్మరథం పట్టారు ప్రజలు.ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండడడంతో నారా బ్రాహ్మిణి మరియు భువనేశ్వరిలతో అలాంటి ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసొస్తుందనేడ్ కొందరి ఆలోచనగా తెలుస్తోంది.అయితే భువనేశ్వరి వయసు రీత్యా పాదయాత్ర చేసే అవకాశం లేదు.

ఇక బ్రాహ్మిణి( Brahmani Nara ) విషయానికొస్తే ఆమెకు రాజకీయాల్లో తిరిగిన అనుభవం లేదు.అందుకే బస్సు యాత్ర లేదా నియోజిక వర్గ పర్యటనలు వంటివి చేయిస్తే టీడీపీకి కలిసొస్తుందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో టీడీపీని గట్టెక్కించే ప్లాన్ ఇదేనని ఆ పార్టీ వర్గంలో కూడా చర్చ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube