ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా పొత్తుల విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది.
బాబు బయట ఉన్నప్పుడూ టీడీపీతో పొత్తు విషయంలో ఆచితూచి స్పందించిన పవన్.ఆయన జైలుకు వెళ్ళగానే టీడీపీతో పొత్తు ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.
దీంతో ఇన్నాళ్ళు ముసుగులో వ్యవహారంగా సాగిన పొత్తు అంశం ఒక్కసారిగా బట్టబయలు అయింది.అయితే మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన పొత్తుపై వైసీపీ ఘాటుగానే స్పనేదిస్తూ వచ్చింది.
పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు ఇచ్చే ముడుపుల కోసం పని చేస్తాడని.ఇలా రకరకల విమర్శలు చేస్తూ వైసీపీ నేతలు.
అయితే ఈ పొత్తు వల్ల వైసీపీ( YCP )కి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అనే అంశాన్ని కాస్త పక్కన పెడితే.ఒక్కటైన రెండు పార్టీలను ఎదుర్కోవడానికి జగన్ ఎలాంటి ప్రణాళికలు రచిస్తారనేదే ఆసక్తికరంగా మారింది.40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును జైలుకు పపించడంలో జగన్ సక్సస్ అయ్యారు.అది కూడా ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ముందే జైలుకు పపించి టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు.
బాబు అరెస్ట్ కావడం ఎవరు కాదన్న టీడీపీపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇక మిగిలింది జనసేన మాత్రమే పవన్ కు అడ్డుకట్ట వేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదు.
ఈ నేపథ్యంలో బాబుకు అవినీతి మరక అంటించినట్లే పవన్ పై కు ఆ తరహా అస్త్రాలను సంధించేందుకు జగన్( YS Jagan Mohan Reddy ) వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆల్రెడీ బాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషి గా జైలుశిక్ష అనుభవిస్తున్నారు.ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి.అందువల్ల టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ కు కూడా ఈ స్కామ్ లో వాటా ఉండే అవకాశం ఉందనే కోణంలో వైసీపీ ఆరోపిస్తోంది.
ఇటీవల మంత్రి రోజా కూడా ఇదే వ్యాఖ్యాలు ప్రస్తావించారు.దాంతో త్వరలోనే పవన్ కు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.
ఇప్పటివరకు పవన్ ఎలాంటి అవినీతి, అక్రమ ఆరోపణలకు చోటివ్వలేదు.మరి పవన్ ను ఇరికించేందుకు జగన్ ఆ దిశగా అడుగులు వేస్తారా అనేది చూడాలి.