ఇప్పుడు ఈటెల వంతు ! టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా ?

ఉద్యమ కాలం నుంచి తనతో కలిసి పనిచేసి, పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సహకారం అందించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారంలో టిఆర్ఎస్ వ్యవహరించిన తీరు పెద్ద సంచలనమే.అకస్మాత్తుగా రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ తప్పించడమే కాకుండా, దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలపై దర్యాప్తు లు, కేసులు అంటూ హడావుడి చేస్తున్నారు.

 Is Etela Rajender Going To Join Bjp And Target Trs, Kcr, Trs, Bjp,ktr, Etela Raj-TeluguStop.com

అంతే కాకుండా ఆర్థికంగా పార్టీని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో రాజేందర్ బీజేపీ లో చేరబోతున్నట్టు సంకేతాలు ఇవ్వడమే కాకుండా , కేంద్ర బిజెపి పెద్దలను కలిసేందుకు డిల్లీకి వెళ్ళారు.

ఆయన చేరిక లాంచన ప్రాయం కావడంతో , రాజేందర్ ను ఇబ్బంది పెడుతూ వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన, కక్ష తీర్చుకునే  అవకాశం ఎక్కువగా ఉందట.అలాగే రాజేందర్ ను ఉపయోగించుకుని బిజెపి టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతోంది అనే లెక్కలు బయటికి వస్తున్నాయి .ఎప్పటి నుంచో తెలంగాణ లో బలపడాలని బిజెపి ప్రయత్నిస్తున్న, కెసిఆర్ ఎత్తుగడల ముందు బిజెపి తేలిపోతుంది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంతకాలం బిజెపి నడిచింది.

ఎన్నికల్లోనూ బిజెపికి విజయం దక్కింది.అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి.

కానీ ఆ తర్వాత బిజెపి బాగా బలహీన పడింది.

ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికలు, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ లోనూ  బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

Telugu Bandi Sanjay, Bjp Trs, Etela Kcr, Etela Bjp, Etela Central, Etela Rajende

అయితే టిఆర్ఎస్, కెసిఆర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు, అనేక రహస్యాలు రాజేందర్ కు తెలిసి ఉండడం ఆయనను ఉపయోగించుకుని టిఆర్ఎస్ ను రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి అనేది బిజెపి ఎత్తుగడగా కనిపిస్తోంది.అందుకే రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం,  కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు, కేసీఆర్ ను రాజేందర్ ద్వారా ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది.ఈరోజు బీజేపీలో చేరే విషయమై క్లారిటీ రాబోతుండడం తో ముందు ముందు తెలంగాణలో రాజేందర్ హవా కనిపించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube