ఆ పేరు వల్ల చదువుకు దూరమైన రాజమౌళి.. ఏం జరిగిందంటే?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినీ కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

 Interesting Facts About Star Director Rajamouli, Rajamouli , Interesting , Abou-TeluguStop.com

అయితే రాజమౌళి కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నారు.ఇంటర్ వరకు చదివినా తన సినిమాలతో ఎన్నో రికార్డులను, అవార్డులను రాజమౌళి ఖాతాలో వేసుకున్నారు.

జక్కన్న అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి కాగా చాలామంది అభిమానులు రాజమౌళిని జక్కన్న అని పిలుస్తారు.

ఏలూరులో రాజమౌళి నాలుగో తరగతి నుంచి ఏకంగా ఏడో తరగతికి ప్రమోట్ అయ్యారు.

అయితే రికార్డులలో మాత్రం రాజమౌళి పేరు విజయ అప్పారావు అని ఉండేది.జక్కన్న తాత పేరు విజయ అప్పారావు కాగా ఆ పేరు తన పేరుగా రికార్డులలో ఉండటం రాజమౌళికి నచ్చేది కాదు.

స్నేహితులు తనను రాజమౌళి అని పిలవకుండా అప్పారావు అని పిలవడంతో జక్కన్న హర్ట్ అయ్యేవారు.ఒక విధంగా చదువు ఆపడానికి పేరు కూడా ఒక రీజన్ అని రాజమౌళి ఒక సందర్భంలో తెలిపారు.

Telugu Cennai, Intermediate, Raghavedra Rao, Raghavendra Rao, Rajamouli, Tollywo

జక్కన్న ఇంటర్ చదివే సమయానికి విజయేంద్ర ప్రసాద్రచయితగా చెన్నైకు షిప్ట్ అయ్యారు.విజయేంద్ర ప్రసాద్ కు అసిస్టెంట్ గా చేరిన జక్కన్న ఆ తర్వాత దర్శకుడు కావాలని అనుకున్నారు.ఆ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఎంతో కష్టపడి రాజమౌళి ప్రపంచం మెచ్చే దర్శకుని స్థాయికి ఎదిగారు.స్టూడెంట్ నంబర్ 1 సినిమాకు మొదట రాజమౌళితో పాటు ముళ్లపూడి వర దర్శకునిగా ఉన్నారు.

Telugu Cennai, Intermediate, Raghavedra Rao, Raghavendra Rao, Rajamouli, Tollywo

అయితే ఒకే సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేస్తే రిజల్ట్ పై ఆ ప్రభావం పడుతుందని భావించి ముళ్లపూడి వర తప్పుకున్నారు.స్టూడెంట్ నంబర్ 1 సక్సెస్ సాధించినా సంవత్సరంన్నర పాటు రాజమౌళి ఖాళీగా ఉన్నారు.రాజమౌళి రెండో సినిమాగా సింహాద్రిని తెరకెక్కించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube