హీరో ఆకాశ్ సినిమాలకు దూరం కావడానికి కారణమిదేనా?

ఆనందం, పిలిస్తే పలుకుతా మరికొన్ని సినిమాలతో హీరో ఆకాశ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే తెలుగులో నటుడిగా ఎక్కువ కాలం ఆకాశ్ కెరీర్ ను కొనసాగించలేకపోయారు.

 Interesting Facts About Hero Akash Cine Career , Akash, Cine Career, Interesting-TeluguStop.com

హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్ తో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన ఆకాశ్ కచ్చితంగా స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకుంటాడని చాలామంది భావించారు.జై ఆకాశ్ అని పిలిచే ఈ హీరో అసలు పేరు సతీష్ నాగేశ్వరన్.

కొలంబోలో జన్మించిన ఈ నటుడు శ్రీలంకలో చదువుకున్నారు.సినిమాలపై ఉన్న ఆసక్తితో లండన్ లో స్థిరపడిన తర్వాత ఆకాశ్ చెన్నైకు వచ్చారు.రోజా వనం అనే కోలీవుడ్ మూవీతో ఆకాశ్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.తెలుగులో రామ్మ చిలుకమ్మా సినిమాలో ఆకాష్ సైడ్ హీరోగా నటించగా శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆనందం సినిమాలో ఆకాశ్ కు మెయిన్ హీరోగా నటించే అవకాశం దక్కింది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఆకాశ్ నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు.ఆకాశ్ నటనకు పలు అవార్డులు సైతం దక్కాయి.సినిమాల్లో నటిసున్న సమయంలో ఆకాశ్ దర్శకుడిగా కూడా మారారు.కొన్ని సినిమాలకు ఆకాశ్ నిర్మాతగా కూడా వ్యవహరించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

నిర్మాతగా ఆకాశ్ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారని సమాచారం.

Telugu Akash, Cine Career-Movie

అయితే ఆకాశ్ కు హీరోగా మంచి గుర్తింపు వచ్చిన సమయంలో స్టార్ హీరోయిన్లతో మాత్రమే నటిస్తానని డిమాండ్లు చేయడం వల్ల కొన్ని మంచి ఆఫర్లు పోయాయని ఆకాశ్ సినిమాలకు దూరం కావడానికి ఇదే కారణమని సమాచారం.ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజైన తర్వాత ఆ సినిమా కథ తనదేనంటూ ఆకాశ్ రచ్చరచ్చ చేసి వార్తల్లో నిలిచారు.లండన్ లో తనకు సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు ఉన్నాయని కూడా గతంలో ఆకాశ్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube