ప్రముఖ నటుడు కృష్ణంరాజు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కృష్ణంరాజు హీరోగా, రాజకీయనాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.సీనియర్ హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కృష్ణంరాజు తన నటన, మాడ్యులేషన్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు.

 Interesting Facts About Actor Krishnamraju Details Here Goes Viral , Actor Krish-TeluguStop.com

నిర్మాతగా మారి తనకు నచ్చిన కథలలో తనే హీరోగా నటిస్తూ ఆ సినిమాలతో కూడా కృష్ణంరాజు విజయాలను సొంతం చేసుకున్నారు.

కృష్ణంరాజు రాజకుటుంబానికి చెందినవారు.

చిన్నప్పుడు గుర్రపు బండిలో ఆయన స్కూల్ కు వెళ్లేవారని సమాచారం.సినిమాలపై కృష్ణంరాజుకు బాల్యం నుంచి ఆసక్తి ఉండేది.

కృష్ణంరాజు అప్పట్లో ఆంధ్రారత్న అనే పత్రికలో జర్నలిస్ట్ గా పని చేశారు.ఆయన సన్నిహితులలో అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు.

తొలి సినిమా చిలకా గోరింక ఆశించిన స్థాయిలో ఆడకపోయినా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పాత్రలలో కృష్ణంరాజు నటించారు.

కృష్ణంరాజు హీరో పాత్రలకు దూరమైన తర్వాత చాలామంది హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటించి మెప్పించడం గమనార్హం.కృష్ణంరాజు తన సోదరుడి కొడుకు అయిన ప్రభాస్ ను స్టార్ హీరో చేశారు.

మంచి డైరెక్టర్ల డైరెక్షన్ లో ప్రాజెక్ట్ లను సెట్ చేసి ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి కృష్ణంరాజు కారణమయ్యారు.

Telugu Andhra Ratna, Chilaka Gorinka, Directors, Krishnamraju, Prabhas-Movie

వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యుడిగా కృష్ణంరాజు పేరు సంపాదించుకున్నారు.సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత పారిశ్రామికవేత్తగా కెరీర్ ను కొనసాగించాలని ఆయన భావించినా పారిశ్రామికవేత్తగా ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ఈతరం ప్రేక్షకులలో కూడా కృష్ణంరాజు నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

కృష్ణంరాజు మరణ వార్త ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధిస్తోంది.రెబల్ స్టార్ గా కృష్ణంరాజు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube