దేశంలోని రైతులలో చాలామంది వ్యవసాయంలో లాభాలు రాకపోయినా వ్యవసాయంపై ఆధారపడి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు.రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల నీళ్లు ఉన్న భూములను సాగు చేయడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపడం లేదు.
అయితే టమాటా, ఉల్లి ( Onion )రేట్లు పెరిగిన సమయంలో చాలామంది రైతులు( Farmers ) లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతున్నారని భావిస్తున్నారు.అయితే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి.
ఉల్లి రేటు పెరిగినా రైతుకు అన్యాయమే జరుగుతోంది.మార్కెట్ లో కిలో ఉల్లి 60 రూపాయలు, అంతకంటే ఎక్కువగా ఉన్నా రైతులకు క్వింటాకు గరిష్టంగా 4100 రూపాయలు మాత్రమే దక్కుతోంది.
ఉల్లి కనిష్ట ధర కేవలం 600 రూపాయలుగా ఉండటం గమనార్హం.రైతులకు ఉల్లి విషయంలో పూర్తిస్థాయిలో న్యాయం అయితే జరగడం లేదనే చెప్పాలి.
ధరలు పెరిగినా రైతులకు లాభాలు రాని పరిస్థితులు నెలకొన్నాయి.మరో రెండు నెలల పాటు ఉల్లి ధర తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకొచ్చారు.ఉల్లి పంట సాగు ఖర్చు అంతకంతకూ పెరుగుతోంది.ఎకరా ఉల్లి సాగుకు 50,000 రూపాయలు ఖర్చు అవుతుండటం గమనార్హం.విత్తన శుద్ధి, కలుపు నివారణ చర్యలు చేపడితే ఉల్లిసాగు( Onion cultivation ) ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక రైతు 512 కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే కేవలం 2 రూపాయలు వచ్చింది.కమిషన్లు తీసివేయగా రైతుకు మిగిలిన మొత్తం ఇంతే కావడం గమనార్హం.ధరలు పెరిగిన సమయంలో అయినా రైతులకు అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఉల్లి ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.ప్రముఖ నగరాల్లో కిలో 25కే ఉల్లి విక్రయించేలా చర్యలు చేపడుతోంది.ఎన్నికల సమయంలో కేంద్రంపై వ్యతిరేకత రాకుండా మోదీ సర్కార్ జాగ్రత్త పడుతుండటం గమనార్హం.