సింగపూర్‌లో( Singapore ) నివసించే భారతీయ సంతతికి చెందిన శ్రీనివాస్ సైనిస్ దత్తాత్రయకు( Shrinivas Sainis Dattatraya ) కొండలు, గుట్టలు, పర్వతాలు ఎక్కడమంటే చాలా ఇష్టం.ఆ ఇష్టంతోనే ఈ పర్వతారోహకుడు మే 19న ఎవరెస్ట్ శిఖరాన్ని( Mount Everest ) చేరుకున్నాడు.
కిందకి రావాల్సిన అతడు దురదృష్టవశాత్తు పైనే తప్పిపోయాడు.సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఎంత ప్రయత్నించినప్పటికీ, వారు అతనిని కనుగొనలేకపోయారు.
ఈ విషయాన్ని శ్రీనివాస్ భార్య సుష్మా సోమ( Sushma Soma ) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
సముద్రం లోతులను, ఎత్తైన పర్వతాలను అన్వేషిస్తూ నిర్భయంగా జీవించే వ్యక్తిగా ఆమె తన భర్తను అభివర్ణించారు.
హై-అల్టిట్యూడ్ సెరిబ్రల్ ఎడెమా అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు శ్రీనివాస్ తనకు చెప్పినట్లు భార్య వెల్లడించారు.పర్వతాలపై ఎక్కినప్పుడు అనారోగ్యానికి గురి చేసే పరిస్థితి ఇది.దీనివల్ల అతను సురక్షితంగా పర్వతం దిగే అవకాశం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీనివాస్ కోసం రక్షణ సిబ్బంది అనేక సమూహాలుగా ఏర్పడి పర్వతమంతా జల్లెడు పడుతున్నారు.ఎందుకంటే అతను ఒకే సాహసయాత్రలో ఎవరెస్ట్ శిఖరాన్ని, ఆపై లొట్సే పర్వతాన్ని అధిరోహించాలని అనుకున్నాడు.ఈ ఫీట్ సాధించినట్లయితే అతనికి మంచి పేరు వచ్చేది కానీ దురదృష్టం కొద్దీ అతని ఇప్పుడు మిస్ అయ్యాడు.
సుష్మా తన భర్త ఆశయం, సంకల్పాన్ని ప్రశంసించారు.
తన భర్త భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ, అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్ గైడ్ డెండీ షెర్పాకు సుష్మ కృతజ్ఞతలు తెలిపారు.రెస్క్యూ ప్రయత్నాల సమయంలో డెండి చలికి గురయ్యాడు.ఆమె క్లైంబింగ్ కమ్యూనిటీకి, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌లోని షెర్పాస్ (నేపాల్ బేస్డ్ అడ్వెంచర్ ట్రావెల్ ఆపరేటర్), శ్రీనివాస యజమాని, JLL, అన్వేషణలో సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఆమె బంధుమిత్రులకు, సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్ భారత హైకమిషన్, నేపాల్, చైనా ప్రభుత్వాల మద్దతును గుర్తించింది.
సింగపూర్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ శ్రీనివాస్ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసింది.
ఢిల్లీలోని సింగపూర్ హైకమిషన్ కుటుంబంతో కాంటాక్ట్‌లో ఉందని, కాన్సులర్ సహాయాన్ని అందించిందని పేర్కొంది.