అమెరికా అధ్యక్ష ఎన్నిల బరిలో మరో భారతీయుడు.. ఏ పార్టీ నుంచి అంటే..?

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

 Indian Origin Hirsh Vardhan Singh Joins Us Presidential Race , Indian Origin-TeluguStop.com

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.

ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్‌ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ( Nikki Halley ), న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Telugu Donald Trump, Hirshvardhan, Indian Origin, Joe Biden, Nikki Halley, Repub

తాజాగా భారత సంతతికి చెందిన మరో అభ్యర్ధి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచాడు.వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన హర్షవర్థన్ సింగ్( Hirsh Vardhan Singh ) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు తన అభ్యర్ధిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమీషన్ వద్ద రిజిస్టర్ చేయించుకున్నారు.

హర్షవర్థన్‌తో కలిపి ఈసారి ముగ్గురు భారత సంతతి నేతలు అధ్యక్ష ఎన్నికల్ల నిలిచినట్లయ్యింది.ఇప్పటికే వివేక్ రామస్వామి, నిక్కీహేలీలు పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Telugu Donald Trump, Hirshvardhan, Indian Origin, Joe Biden, Nikki Halley, Repub

అయితే ఇతను కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.ఇప్పుడే ఇలా వుంటే రాబోయే రోజుల్లో ఇంకెంత మంది భారతీయులు పోటీలో నిలుస్తారో చూడాలి.రిపబ్లికన్ల జాతీయ సదస్సు ద్వారా ఆ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించనున్నారు.కాగా .రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్( Donald Trump ), డిసాంటిస్‌లకు విస్తృత ప్రచారం చేయడానికి నిధులు వున్నాయి.ఈ ఏడాది రెండో త్రైమాసికంలోనే ట్రంప్ 35 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తారని ఆయన ప్రచార బృందం తెలిపింది.

అయితే డిసాంటిస్ తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన ఆరు వారాల్లోనే ఏకంగా 20 మిలియన్ డాలర్లు సేకరించడం గమనార్హం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube