హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఇండియన్ ఆరిజిన్ యాక్టర్లు ఎవరో తెలుసా?

ఇండియన్ సినిమాలు ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి.భారతీయ సినిమాలు ప్రపంచ దేశాల్లో మంచి విజయాలు దక్కించుకుంటున్నాయి.

 Indian Actor In Hollywood And Getting Popularity, Sunita Mani, Geraldine Viswa-TeluguStop.com

బాహుబలి సినిమా పలు ప్రపంచ భాషల్లోకి విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ చైనాలో కనీవినీ ఎరుగని రీతిలో హిట్ అయ్యింది.

భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత ప్రధాని మోదీతో దంగల్ మూవీ గురించి మాట్లాడారంటే ఆ సినిమా గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.భారతీయ సినిమాలే కాదు.

ఇండియన్ హీరోయిన్లు సైతం హాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.ఇండియన్ ఆరిజన్ యాక్టర్లుగా మంచి పేరు సంపాదించుకుంటున్నారు.

విదేశీ నటులతో సమాన స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.ఇంతకీ హాలీవుడ్ ను ఏలుతున్న ఇండియన్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మైత్రేయి రామకృష్ణన్‌

Telugu Ritu Arya, Sunita Mani-Telugu Stop Exclusive Top Stories

నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది.ఈనెల 15న రెండో సీజన్ రిలీజ్ కాబోతుంది.తొలి సీజన్ లో మంచి నటన కనబర్చిన మైత్రేయి రెండో సీజన్ లోనూ కనిపించనున్నారు.మైత్రేయి తండ్రి తమిళనాడు వాసి.భారతీయ మూలాలు ఉన్న శ్రీలంక తమిళ శరణార్థి తను.మైత్రేయి చిన్నప్పుడే కెనడా వెళ్లింది.పదో తరగతిలో ఉన్నప్పుడే నటనా రంగంలోకి వచ్చింది.తొలుత స్కూల్లో స్టేజ్ షోలు చేసింది.నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ ఆడిషన్స్ కోసం 15 వేల మంది వెళ్లారు అందులో కేవలం మైత్రేయి రామకృష్ణన్‌ మాత్రమే ఎంపిక అయ్యింది.

రీతూఆర్య

Telugu Ritu Arya, Sunita Mani-Telugu Stop Exclusive Top Stories

అటు త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ కానున్న అమెరికన్‌ యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ రెడ్ నోటీస్ లో నటించిన రీతూ ఆర్య సైతం ఇండియన్ ఆరిజిన్ యాక్టరే.బ్రిటీష్‌ టీవీ సిరీస్‌ డాక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది రీతూ.హ్యూమన్స్‌ ఆమెకు అద్భుత గుర్తింపు తెచ్చింది.

రెడ్‌ నోటీస్‌లో డ్వేన్‌ జాన్సన్‌, గాల్‌ గాడట్‌ లాంటి హాలీవుడ్ టాప్ యాక్టర్లతో నటించే అవకాశం దక్కించుకుంది.ద అంబరిల్లా అకాడెమీ సెకెండ్ సీజన్‌ రీతూ ఆర్యకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

జెరాల్డీన్‌ విశ్వనాథన్‌

Telugu Ritu Arya, Sunita Mani-Telugu Stop Exclusive Top Stories

బ్యాడ్‌ ఎడ్యుకేషన్‌లో జర్నలిస్టుగా, హలాలో స్కేటర్‌గా నటించి సత్తా చాటింది జెరాల్డీన్‌ విశ్వనాథన్‌.ఈమె తండ్రి మలేషియన్‌ తమిళ్‌.తల్లి స్విట్జర్లాండ్‌ దేశస్తురాలు.బ్లాకర్స్‌ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.హాలీవుడ్‌ స్టార్స్‌ హ్యూ జాక్‌మెన్‌, డానియల్‌ రాడ్‌ క్లిఫ్‌ తో కలిసి నటించింది ఈ ఇండియన్ ఆరిజిన్ నటీమణి.వచ్చే ఏడాది రిలీజ్ కానున్న రంబుల్ లో మిన్నీ క్యారెక్టర్ కు ఈమె డబ్బింగ్ కూడా చెప్పింది.

సునీతా మణి

Telugu Ritu Arya, Sunita Mani-Telugu Stop Exclusive Top Stories

బాలీవుడ్ లో సత్తా చాటి హాలీవుడ్ లో అడుగు పెట్టిన నటి ప్రియాంకా చోప్రా.అక్కడ ఏకంగా ఆమె ఓ చిత్రాన్నే నిర్మించింది.దాని పేరు ఈవిల్ ఐ. ఇందులో సునీతా మణి అనే అమ్మాయి నటించింది.ఆమె కూడా ఇండియన్ ఆరిజిన్ గర్ల్.అటు సరితా చౌదరి కూడా ఇందులో నటించింది.తను కూడా భారతీయ మూలాలున్న నటే.అటు అమెరికన్‌ టీవీ సిరీస్‌ గ్రాండ్‌ ఆర్మీ లో నటించిన ఆష్లీ గేంగర్‌ కూడా ఇండియన్ ఆరిజిన్ యాక్టర్.ద విచర్‌ లో ఛాన్స్‌ కొట్టేసి అన్యా ఛలోట్రా కూడా భారతీయురాలే కావడం విశేషం.

అటు ఇప్పటికే బాలీవుడ్ నటులు ఇర్ఫాన్‌ ఖాన్‌, ఓం పురి, ఐశ్వర్యారాయ్‌, దీపికాపదుకొనే, ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌ లో పలు సినిమాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube