భారత్ – కువైట్ కీలక ఒప్పందం...వలస కార్మికులకు గుడ్ న్యూస్...కానీ

ఉపాధి కోసం ఎంతో మంది భారత్ నుంచీ వివిధ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వలసలు వెళ్ళిన వారిలో చాలా మంది మధ్య వర్తుల ద్వారానో లేక యజమానుల కారణంగానో మోసపోతూ ఉంటారు జీతాలు సరిగా ఇవ్వక పోగా వెట్టి చాకిరి చేయించుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు.

 India-kuwait Key Agreement  Good News For Migrant Workers But , India-kuwait,  K-TeluguStop.com

ఈ పరిస్థితులు ముఖ్యంగా కువైట్ వంటి దేశాలలో జరుగుతూ ఉంటాయి.ఈ దేశాలకు వలసలు వెళ్ళే ఎంతో మంది కార్మికులు మధ్య వర్తుల ద్వారా వెళ్ళడంతో చేతికి నెల జీతం వచ్చే వరకూ తెలియదు తాము మోసపోయినట్టుగా అందుకే.

భవిష్యత్తులో వలస కార్మికులు మోసపోకుండా, భారత్ – కువైట్ దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఇకపై డొమెస్టిక్ వర్కర్ల నియామకంలో ఎలాంటి పొరబాట్లు, మోసాలు జరగకుండా జాగ్రత్తగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుని ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇందుకుగాను ఆదేశ క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపిందట.తాజా ఒప్పందం ప్రకారం.

ఇకపై మహిళలను కార్మికులుగా పనుల్లో కుదుర్చుకునేందుకు పలు నిభంధనలతో కూడిన ఉత్తరువులు జారీ చేసిందని తెలుస్తోంది.ముఖ్యంగా కువైట్ వచ్చే భారతీయ మహిళలు ఎవరైనా సరే వారి వయసు 30 ఏళ్ళు పైనే ఉండాలని, 30 ఏళ్ళ లోపు వారికి కువైట్ లో పనిచేసే అవకాశం లేదని తెలుస్తోంది.

ఏజెన్సీ లు ఎలాంటి తప్పుడు సమాచారంతో నైనా సరే 30 ఏళ్ళ లోపు వారిని కువైట్ లోకి తీసుకువస్తే వారిపై కటినమైన చర్యలు చేపడుతామని హెచ్చరించింది.అలాగే జీతంగాను నెలకు రూ.25 వేలకు తగ్గకుండా ఇవ్వాలట.అది కూడా నేరుగా చేతికి ఇవ్వకూడదని, వారిని పనిలోకి ఎవరైతే కువైట్ స్థానికులు కుదుర్చుకుంటారో ఆ యజమానులు వారికి కొత్త ఎకౌంటు లు ఓపెన్ చేయించి ఆ ఖాతాలలో జీతం జమ చేయాలట.

కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తేదీ మొదలు, కాంట్రాక్ట్ ముగిసే వరకూ ఈ నిభందన వర్తిస్తుందని తెలుస్తోంది.అయితే ఈ నిభంధనలలో 30 ఏళ్ళ లోపు మహిళలను కువైట్ లోకి భారత్ నుంచీ అనుమతి ఇవ్వకపోవడం ఇబ్బంది కరమైన చర్యలని ఇది డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube