భవిష్యత్తుపై భరోసాను కలిగిస్తున్న భారత్: బిల్ గేట్స్

అవును, మీరు విన్నది నిజమే.ప్రపంచ మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ స్వయంగా అన్న మాట ఇది.

 India Is Promising For The Future: Bill Gates Bharat, India, Bill Gates, Billion-TeluguStop.com

భవిష్యత్తుపై భారత్ ఆశను కలిగిస్తోందని ఆయన నొక్కి వక్కాణించారు.ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎలాంటి పెద్ద సమస్యలైనా సరే ఒకేసారి పరిష్కరించగలదనీ ఆ దేశం నిరూపించింది అని తాజాగా తన బ్లాగ్ ‘Gates Notes‘లో పేర్కొన్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో క్షేత్రస్థాయిలో ఆవిష్కర్తలు, నిపుణులు సాధిస్తోన్న ప్రగతిని పరిశీలించేందుకు త్వరలో ఆయన భారత్ కి వస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కాగా బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలను PMO (ప్రధానమంత్రి కార్యాలయం) ట్విటర్ వేదికగా షేర్ చేయడం విశేషం.మొత్తంగా ఆయన పేర్కొన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే….పెద్ద పెద్ద ఆవిష్కరణలు, డెలివరీ మాధ్యమాలతో ప్రపంచం ఒకేసారి పెద్ద సమస్యలపై పురోగతి సాధించగలదు.

అయితే, దీనికి చాలా సమయం, డబ్బు సరిపోదనే వ్యాఖ్యలు మనకు బాగా వినిపిస్తాయి.కానీ, భారత్ వాటన్నిటినీ తప్పు అని నిరూపించింది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనున్న ఆ దేశం.ఎలాంటి కఠిన సవాళ్లనైనా ఎదుర్కోగలదని చాటుకుంది.

ఈ క్రమంలో పోలియో, HIV, పేదరికం, శిశు మరణాలవంటి వాటిని నిర్ములించింది.

ఇలా భారత్ సాధించిన అద్భుతమైన పురోగతికి మించిన రుజువు ఇంకేదీ లేదని, మొత్తంగా చూసుకుంటే భవిష్యత్తుపై భరత్ ఆశను కలిగిస్తోంది అని అన్నారు.అలాగే ఇతర దేశాల మాదిరిగానే.భారత్ కూడా పరిమిత వనరులను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ఎలా పురోగతి సాధించగలదో నిరూపించింది అని అభిప్రాయపడ్డారు.

దేశ ప్రజలకు ఆహార భద్రత, రైతులకు ప్రోత్సాహం విషయంలో ఇండియా మెరుగైన స్థితిలో ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు, దాతృత్వ రంగాల పరస్పర సహకారంతో.పరిమిత వనరులతోనే అభివృద్ధికి బాటలు వేయొచ్చని భారత్ ప్రపంచదేశాలకు సెలవిచ్చిందని బిల్ గేట్స్ తన బ్లాగ్లో రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube