ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హయాంలో భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.కరోనా విపత్తు తరువాత నేడు చాలా దేశాలు ఆర్ధిక మందగమనములో నడుస్తున్నాయి.
అయినా అతి పెద్ద జనసాంద్రత కలిగినటువంటి భారత దేశం( India ) మాత్రం నేటికీ తన ఉనికిని చాటుకోవడం విశేషం అని చెప్పుకోవచ్చు.ఇకపోతే ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే.
దాదాపు 6 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.ఈ క్రమంలో ఆయన ముందుగా జపాన్ చేరుకోవడం జరిగింది.
G-7 సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్లడం జరుగగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వి.జెలెన్స్కీతో( Zelensky ) ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.కాగా ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన అంశాలు ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.తాజాగా విదేశీ వార్తాపత్రికలు కూడా ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య జరిగిన సంభాషణనే ప్రధానంగా కవర్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం జపాన్‌లోని హిరోషిమాలో జరిగింది.ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
ఈ క్రమంలో జపాన్‌లో భారత ప్రధానికి ఇచ్చిన ఆథిత్యం కూడా చాలా దేశాల్లో వైరల్ అవుతోంది.పొరుగు దేశం పాకిస్థాన్‌లో ( Pakistan ) కూడా ఈ విషయంపై చర్చ జరగడం కొసమెరుపు.ఈ క్రమంలో అక్కడి జర్నలిస్టులు, మాజీ డెమొక్రాట్లు, మాజీ బ్యూరోక్రాట్లు, ప్రపంచ వ్యవహారాల నిపుణులు ఇప్పుడు భారతదేశం అన్ని కోణాలను దాటిందని భావిస్తున్నారు.పాకిస్తాన్‌లోని ఒక యూట్యూబ్ ఛానెల్‌లో, ఒక జర్నలిస్ట్ లాయర్ ను ఓ ప్రశ్న అడగగా దీనిపై ఆయన స్పందిస్తూ ప్రపంచ స్థాయిలో భారత్ అగ్ర దేశంగా మారిందనడంలో సందేహం ఎంతమాత్రమూ లేదు అని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని పాక్ స్థానిక మీడియాలు కవర్ చేయడం గమనార్హం.