తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ( Janasena party )తొలిసారిగా పోటీ చేయబోతోంది.కేంద్ర అధికార పార్టీ బిజెపితో ( BJP )పొత్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి సీట్ల పంపకాలు చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
పొత్తులో భాగంగా జనసేనకు 09 సీట్లు ఇచ్చేందుకు బిజెపి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది.అయితే జనసేన 11 సీట్లు ఖరారు చేసినా బిజెపి 9 సీట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది .ఇప్పటికే జనసేనకు కేటాయించబోయే నియోజకవర్గాల వివరాలు బయటకు వచ్చాయి.ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించేందుకు జనసేన ఏర్పాట్లు చేసుకుంటుంది.
అయితే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తెలంగాణలో జనసేన ను బలోపేతం చేసే విషయంపై పవన్( Pawan Kalyan ) అంతగా దృష్టి పెట్టలేదు.
అక్కడ పోటీ చేసే ఆలోచన లేకపోవడంతో పెద్దగా అక్కడ పార్టీ వ్యవహారాలను పవన్ పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు బిజెపితో పొత్తు కుదిరిన నేపథ్యంలో బిజెపికి పొత్తులో భాగంగా కేటాయించే నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను పోటీకి దించాలనే ఆలోచనతో ఉంది.బిజెపి, జనసేనకు కేటాయించే స్థానాలపై పూర్తి క్లారిటీ లేదు, సేరి లింగంపల్లి , తాండూరు ఇస్తారా లేదా అనే దాని పైన అనుమానాలు ఉన్నాయి .కూకట్ పల్లి తో పాటు, 8 నియోజకవర్గాలు జనసేనకు ఖరారు అయ్యాయి.అక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత ఉంది.
తెలంగాణ జనసేన ఇన్చార్జి శంకర్ గౌడ్ ( Sankar Goud )కు ఏ నియోజకవర్గంలో కేటాయించబోతున్నారనేది ఆసక్తికరంగా మారిందిఆయన కూకట్ పల్లి టికెట్ ఆశించినా తాజాగా ఓ కీలక బిజెపి నేత పార్టీలో చేరడంతో ఆయనకే సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .ఇక మిగిలిన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు జనసేన వెతుకుతోంది.అయితే బిజెపి కాంగ్రెస్ లోని కీలక నేతలు కొంతమంది తమకు టికెట్ కన్ఫామ్ చేస్తే పార్టీలో వెంటనే చేరిపోతామనే రాయబారాలు పంపిస్తున్నారు.
ముఖ్యంగా శేరిలింగంపల్లి సీటును కేటాయిస్తే వెంటనే పార్టీలో చేరిపోతానని సత్యం రావు అనే కాంగ్రెస్ నేత చెబుతున్నారట.ఇక నిన్ననే జనసేనలో చేరిన టీవీ నటుడు సాగర్ ( Sagar )కు రామగుండం సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.బిజెపి, కాంగ్రెస్ లో టికెట్ దక్కిన వారు , దక్కే అవకాశం లేదనుకున్న వారు ఇప్పుడు జనసేన ద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో అనూహ్యంగా జనసేనకు తెలంగాణలో డిమాండ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది.