టమాట సాగును నిలువు పందిరి విధానంలో చేస్తే.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి..!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు సంభవించి, అత్యాధునిక సేద్యపు పద్ధతులతో వ్యవసాయం అనేది లాభసాటిగా మారింది.నూతన విధానాల వల్ల శ్రమ తగ్గడంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చు.

 If Tomato Cultivation Is Done In Vertical Canopy System.. High Yield With Less I-TeluguStop.com

ఓ రైతు టమాటా సాగును( Tomato Cultivation ) సాధారణ పద్ధతిలో కాకుండా పందిరి విధానంలో పండించి ఆదర్శంగా నిలిచాడు.

సెమీ ఆర్గానిక్( Semi-organic ) పద్ధతిలో పంటలు సాగు చేయడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చని నిరూపించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు.అంతేకాకుండా రంగా పేట గ్రామానికి చెందిన ఓ రైతు తన రెండున్నర ఎకరాల భూమిలో స్కేటింగ్ పద్ధతి( Skating method )లో టమాటా పంటను సాగు చేశాడు.

పంట వేసిన 60 రోజులకు పంట మొదటి కోతకు వస్తుంది.దాదాపుగా వెయ్యి బాక్సుల దిగుబడి పొందవచ్చు.ఒక బాక్స్ కు 25 కిలోలు వేసుకున్న 25 టన్నుల దిగుబడి సాధించవచ్చు.

టమాట పంట మొత్తం దిగుబడి దాదాపుగా 150 టన్నుల వరకు ఆరు లేదా ఏడు కోతలలో పొందవచ్చు.

నిలువు పందిరి విధానం ప్రత్యేకత ఏమిటంటే.మొక్కలు ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి.ప్రతి కొమ్మ ను పైకి పాకించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

సాధారణ పద్ధతిలో టమాట సాగు నాలుగు నెలలు పూర్తవుతుంది.కానీ నిలువు పందిరి విధానంలో పంట కాలం పెరగడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది.

సాధారణ పద్ధతిలో సాగు చేస్తే టమాటా కాయలు( Tomatos ) నేలపై వాలే అవకాశం ఉంటుంది.దీనివల్ల టమాట సైజు ఆశించిన స్థాయిలో పెరగదు.కానీ నిలువు పద్ధతి విధానంలో పైకి పాకడం వలన టమాటా కాయ సైజు పెరుగుతుంది.పైగా నిలువు పద్ధతి విధానంలో చీడపీడలను తొందరగా గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది.

సాధారణ పద్ధతిలో అయితే చీడపీడలను గుర్తించడం లో కాస్త ఆలస్యం అవుతుంది.కాబట్టి నిలువు పందిరి విధానంలో సాగు చేస్తే కాస్త పెట్టుబడి తగ్గడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడి పొంది మంచి లాభాలు అర్జించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube