తొలి ప్రయత్నంలో ఫెయిల్.. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీకి సలాం అనాల్సిందే!

సక్సెస్ అనే పదం ఎంతోమంది జీవితాలలో కీలక పాత్ర పోషిస్తుంది.కొంతమందికి సులువుగా, సునాయాసంగా సక్సెస్ దక్కితే మరి కొందరు ఎంత కష్టపడినా సక్సెస్ దక్కదు.

 Hyderabad Collector Anudeep Success Story Details Here Goes Viral , Durishetti-TeluguStop.com

యూపీఎస్సీ( UPSC ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలలో టాపర్ గా నిలవాలాంటే రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన దురిశెట్టి అనుదీప్ ( Durishetti Anudeep )సక్సెస్ స్టోరీ ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనుదీప్ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది.భద్రాద్రి( Bhadradri ) (కొత్తగూడెం) జిల్లాకు కలెక్టర్ గా పని చేసి ప్రశంసలు పొందిన అనుదీప్ ప్రస్తుతం హైదరాబాద్ కు కలెక్టర్ గా పని చేస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై అనుదీప్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.రెండో ప్రయత్నంలో ఐ.ఆర్.ఎస్ కు ఎంపికైన అనుదీప్ ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కూడా పని చేశారు.

Telugu Anudeep, Bhadradri, Irs, Prelims, Upsc-Latest News - Telugu

సాఫ్త్ వేర్ జాబ్ చేస్తూనే ప్రజలకు సేవ చేయాలని సివిల్స్ పై దృష్టి పెట్టానని అనుదీప్ అన్నారు.రెండో ప్రయత్నంలో ఐ.ఆర్.ఎస్ లో చేరినా మనస్సు ఐఏఎస్ పై ఉండేదని ఆయన వెల్లడించారు.2012లో ప్రిలిమ్స్ లో పాస్ అయినా మెయిన్స్ లో ఫెయిల్ అయ్యానని ఆయన పేర్కొన్నారు.ఆ తప్పులు రిపీట్ కాకుండా అడుగులు వేశానని అనుదీప్ వెల్లడించారు.

Telugu Anudeep, Bhadradri, Irs, Prelims, Upsc-Latest News - Telugu

2017లో నాకు చివరి అవకాశం అని ఆ సమయంలో ఆలిండియాలో టాప్ ర్యాంక్ సాధించడం గమనార్హం.శాస్త్రీయ పద్ధతిలో కష్టపడితే తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించవచ్చని అనుదీప్ అన్నారు.అనుదీప్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనుదీప్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube