కన్నడలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఈ సినిమాతో హీరో యశ్ ఓవర్‌నైట్ స్టార్‌డమ్ కొట్టేశాడు.
పవర్‌ఫుల్ మూవీగా తెరెకెక్కిన కేజీఎఫ్ చిత్రంతో ఈ హీరో తెలుగు, హిందీ భాషల్లో కూడా అభిమానులను సంపాధించుకున్నాడు.కాగా ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
కాగా రీసెంట్‌గా కేజీఎఫ్ 2 చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతోంది.
ఈ విషయం తెలుసుకున్న కొందరు మహిళా అభిమానులు, యశ్‌ను చూసేందుకు అక్కడికి పెద్ద సంఖ్యంలో చేరుకున్నారు.అయితే ఈ ప్యాలెస్‌ను ఇటీవల హోటల్‌గా మార్చడంతో అక్కడికి భోజనం చేసేందుకని చేయడానికి వచ్చిన మహిళలు, యశ్‌ను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.
మొత్తానికి యశ్‌కు కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనడానికి ఇదొక నిదర్శనం అంటున్నారు కన్నడ అభిమానులు.ఇక కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.