'బిబి' అంటే బిగ్‌ బాస్‌ కాదన్న గీత మాధురి భర్త

ప్రస్తుతం తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు సంబంధించిన హడావుడి నడుస్తుంది.ఇలాంటి సమయంలో ప్రముఖ సింగర్‌ గీతా మాధురి భర్త నందు తాను బిబి లో ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

 Geetha Madhuri Husband Bomma Block Buster Poster Release, Geetha Madhui , Nandu,-TeluguStop.com

దాంతో అంతా కూడా నందు బిగ్‌ బాస్‌ లో ఉండబోతున్నాడు అనుకున్నారు.కాని కొందరు మాత్రం ఏదో షో లేదా సినిమా ప్రమోషన్‌ అయ్యి ఉంటుందని అనుకున్నారు.

నందు హడావుడి మామూలుగా చేయలేదు.బిగ్‌బాస్‌ రేంజ్‌ లో ఆయన చేసిన హడావుడిపై క్లారిటీ వచ్చేసింది.

ఆయన అన్నది బిబి అంటే బిగ్‌ బాస్‌ కాదు బొమ్మ బ్లాక్‌ బస్టర్.

నందు హీరోగా బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అనే సినిమా తెరకెక్కుతోంది.

ఆ సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. బిబి అంటూ హైప్‌ క్రియేట్‌ చేసిన నందు ఇప్పుడు అందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చి ఓ అంతేనా అంటూ జనాలు అనుకునేలా చేశాడు.

తెలుగు బిగ్‌ బాస్‌ 4 లో నందు ఉంటాడు అంటూ చాలా చర్చ జరిగింది.చివరకు ఆయన బిగ్‌బాస్‌ లో ఉండటం లేదు అనే క్లారిటీ వచ్చేసింది.

ఈ విషయంలో జనాలను నందు ఊరించి చివరకు ఉసూరుమనిపించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Big Boss, Geetha Madhui, Geethamadhuri, Nandhu, Nandu-

రెండవ సీజన్‌ లో బిగ్‌ బాస్‌ రన్నరప్‌ గా గీతా మాధురి నిలిచింది.ఈసారి ఆమె భర్త వెళ్తాడా అనే చర్చ జరిగింది.కాని నందుకు ఆ విషయమై ఆసక్తి లేదని క్లారిటీ వచ్చేసింది.

ఇదే సమయంలో ఆయన సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు.ఇక ఐపీఎల్‌ ప్రారంభం కాబోతుంది.

అందుకు సంబంధించి కామెంట్రీ కార్యక్రమాలను కూడా నందు నిర్వహిస్తూ ఉంటాడు.కనుక బిగ్‌ బాస్‌ లోకి ఆయన ఎంట్రీ లేన్నట్లే.

మరి వచ్చే సారి అయినా నందు ఉంటాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube