వైరల్ : వావ్, ఇండియన్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్ కారు..

ఇండియన్ల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మన దేశస్థులకు వచ్చే ఆలోచనలకు ఎంతటి మేధావులైన ఆశ్చర్యపోక తప్పదు.

 Helicopter Car Circling Indian Roads Indina Roads, Helicopter, Viral Latest, Ne-TeluguStop.com

గతంలో ఎన్నో వినూత్నమైన ఆలోచనలు చేసి ఎందరినో ఆశ్చర్యపరిచిన ఇండియన్లు ఇప్పటికీ ఏదో ఒక విధంగా తమ క్రియేటి విటీతో ఆకట్టు కుంటున్నారు.తాజాగా మనం చెప్పకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే.

ఇతడు ఓ కారుని ఏకంగా హెలికాప్టర్ గా మార్చేశాడు.దీన్ని రోడ్లపై నడుపుతూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.

బిహార్ రాష్ట్రానికి చెందిన శర్మ అనే ఒక యువకుడికి పైలట్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది.కానీ పైలెట్ చదివేంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో అతను తన కోరికను నెరవేర్చుకోలేక పోయాడు.

అయినప్పటికీ హెలికాప్టర్ కు పైలెట్ కావాలనే తన డ్రీమ్ ను అతడు వదులు కోలేదు.తన కలను సాకారం చేసుకునేందుకు అతడు తన నానో కారును హెలికాప్టర్ గా రూపుదిద్దాడు.ఇందుకు అతడు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టాడు.కారులో ఇంటీరియర్ పార్ట్స్ ను కూడా హెలికాప్టర్ లో బటన్ల మాదిరిగానే మార్చేశాడు.రోటర్ బ్లేడ్ లతో సహా సెన్సార్లను కూడా అమర్చి తన కారును అచ్చం హెలికాప్టర్ లాగానే సిద్ధం చేసి ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నాడు.

అయితే ఇది హెలికాప్టర్ కి కార్బన్ కాపీగా ఉండటంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు.వధూవరుల సైతం ఇందులో ప్రయాణించాలని ఆశపడుతున్నారు.ఇలా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ వచ్చి పడుతోంది.ప్రతిరోజు ఈ కారు వివాహ వేడుకలకు లేదా మిగతా ఫంక్షన్లకు వెళ్తుంది.ఆ విధంగా శర్మ బాగా డబ్బు సంపాదిస్తున్నాడు.ఇండియన్ రోడ్లపై తిరుగుతున్న హెలికాప్టర్ కమ్ కార్ కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

వీటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇండియన్ యువకుల్లో ఇలాంటి సృజనాత్మకత ఉండటం గొప్ప విషయం అంటూ నెటిజన్లు శర్మను పొగుడుతున్నారు.

అయితే గతంలో కూడా ఒక భారతీయ వ్యక్తి తన కారును హెలికాప్టర్ గా మార్చాడు.ఈ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube