బిగ్ బాస్ షో విన్ కావడానికి తనే కారణం.. రేవంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 విజేత రేవంత్ అనే సంగతి తెలిసిందే.ఈ షోకు విజేతగా నిలవడం కోసం రేవంత్ పడిన కష్టం అంతాఇంతా కాదు.40 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉన్నా రేవంత్ మాత్రం బిగ్ బాస్ షో ట్రోఫీకే ప్రాధాన్యత ఇచ్చారు.అయితే బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన తర్వాత ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వని రేవంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

 He Is The Reason For Winning The Bigg Boss Show Revanths Shocking Comments Are-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ మొదట 40 లక్షల రూపాయల డబ్బులు తీసుకోవాలని అనుకోలేదని అయితే ఆ తర్వాత శ్రీహాన్ డబ్బుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని రేవంత్ అన్నారు.డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బిగ్ బాస్ షో విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయేవాడినని రేవంత్ పేర్కొన్నారు.

తన కూతురి వల్లే నేను బిగ్ బాస్ విజేతగా నిలిచానని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

తన కూతురు లక్కీ ఛార్మ్ అని కూతురు జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు లక్ కలిసొచ్చిందని రేవంత్ కామెంట్లు చేశారు.గీతూ రాయల్ బిహేవియర్ వల్లే ఆమె బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు.రాజ్ టాప్3 లో ఉంటాడని నేను భావించానని కానీ అలా జరగలేదని ఆయన కామెంట్లు చేశారు.

నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో బయట ఎలా ఉంటానో అదే విధంగా ఉన్నానని ఆయన అన్నారు.

బిగ్ బాస్ షో తనకు ఎంతోమంది మంచి స్నేహితులను ఇచ్చిందని రేవంత్ తెలిపారు. ఆదిరెడ్డి జెన్యూన్ అని రేవంత్ పేర్కొన్నారు.రేవంత్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ విజేతగా నిలిచినా రేవంత్ లో కొంచెం కూడా గర్వం లేదని ఈ విషయంలో మాత్రం రేవంత్ గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube