ప్రపంచంలోనే ఇలాంటి రెస్టారెంట్‌ ఇదొక్కటే... ఎక్కడుందో తెలుసా?

మీరు ఇలాంటి హోటల్ అక్కడ తప్పితే ఇంకెక్కడా చూసుండరు.ఎందుకంటే అలాంటి చోట కూడా ఓ అద్భుతమైన హోటల్ ని నిర్వహించొచ్చా? అనే ఆలోచన ఎవరికి వస్తుంది చెప్పండి? గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో సాధారణంగా మనం చూస్తూ వుంటాం.అది సర్వ సాధారణమైన విషయం.స్వీడన్‌లోనైతే( Sweden ) ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు.అవును మరి, ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవి కావడం విశేషం.

 Have You Ever Seen The World First Permanent Ice Hotel In Sweden Details, Sweden-TeluguStop.com

ఇంకో విషయం ఏమిటంటే… జేమ్స్‌ బాండ్‌ సినిమా ‘డై ఎనదర్‌ డే’లో( Die Another Day ) కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం.టోర్నె నదిలో ( Torne River ) గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు అంటే మీరు నమ్ముతారా? ఇందులో పన్నెండు ఆర్ట్‌ స్వీట్‌రూమ్స్, ఒక డీలక్స్‌ స్వీట్‌రూమ్, థీమ్డ్‌ రూమ్‌లు, బార్‌ సహా పలు వసతులు ఉన్నాయి.అంతేకాదండోయ్… ఈ హోటల్‌లో పది ఒలింపిక్‌ స్విమింగ్‌ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్‌ కూడా ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే “లూకా రోంకొరోని” నేతృత్వంలో ఏకంగా ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించడం కొసమెరుపు.దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్‌ ఐదు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంటుంది.ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులోనే ఉంటుంది.ప్రతిక్షణం దీనిని నిర్వాహకులు పర్యవేక్షిస్తూనే వుంటారు.దానికోసం పదుల సంఖ్యలో జనాలు ఇక్కడ పని చేస్తూ వుంటారు.ఇక ఇక్కడికి వెళ్ళిన పర్యటకులు( Tourists ) మాత్రం ఎనలేని అనుభూతులను మోసుకొని వస్తారు అనడంలో సందేహమే లేదు.

ఆయా అనుభూతులను వారే స్వయంగా చెబుతూ వుంటారు.ఇదొక భూత హిమ స్వర్గం అని కీర్తిస్తూ వుంటారు.

Worlds First Ice Hotel in Sweden

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube