సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్న హరీష్ శంకర్

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సక్సెస్ లతో కెరియర్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.కథతో పాటు కమర్షియల్ అంశాలకి ప్రాధాన్యత ఇచ్చే మహేష్ బాబు తన ప్రతి సినిమాలో కచ్చితంగా ఒక సోషల్ మెసేజ్ ఉండేలా ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నారు.

 Harish Shankar Got A Chance Movie With Mahesh Babu, Tollywood, Telugu Cinema, So-TeluguStop.com

సామాజిక అంశాలని టచ్ చేస్తూ హీరోఇజం చూపిస్తున్నాడు.ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా ఓపెనింగ్ జరుపుకొని సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమాపై క్లారిటీ లేకపోయినా అతనితో సినిమా చేయడానికి చాలా మంది సిద్ధం అవుతున్నారు.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుని గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా లైన్ పెట్టాడని టాక్ వినిపిస్తుంది.హరీశ్ శంకర్ వినిపించిన ఒక లైన్ కి మహేశ్ బాబు ఓకే చెప్పేశాడని అంటున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, త్వరలో మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పాడు.ఇప్పుడు ఆ ప్రాజెక్టు సెట్ అయిందన్న మాట.ప్రస్తుతం పవన్ సినిమా కోసం హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఆ తరువాత మహేశ్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.

అయితే హరీష్ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలంటే వచ్చే ఏడాదిలోనే సాధ్యం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube