ఏ స్విచ్ నొక్కినా ... బీజేపీకే ఓటు పడుతుందా ...?

ఈవీఎం ల పనితీరు మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మరికొన్ని ఆరోపణలు గుప్పించి అందరిలోనూ… మరికొంత గందరగోళం పెంచేసింది.తాజాగా… ఆ పార్టీ సేవు నాయకుడు గులాంనబీ ఆజాద్ మరికొన్ని ఆరోపణలు చేశారు.ఈవీఎంలో ఏ పార్టీ గుర్తు మీద నొక్కినా….ఓటు మాత్రం బీజేపీకే పడుతోందన్నారు.అందుకే… ఎన్నికల్లో ఈవీఎం విధానానికి స్వస్తి చేప్పి మళ్లీ బ్యాలెట్ నే పెట్టాలంటూ… ఈసీని విపక్ష నేతలు కలిశారు.ఈవీఎంలపై తయారు చేసిన నివేదికను సీఈసీకి విపక్షనేతలు అందజేశారు.

 Gulam Nabi Azad And Opposition Leaders Met Ec On Evms-TeluguStop.com

ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్ … ఈవీఎంలలో అవకతవకలపై సీఈసీకి వివరించామన్నారు.ఈవీఎంలపై ఉన్న సందేహాలను ఈసీకి వివరించినట్లు వెల్లడించారు.పోలైన ఓట్లకు, ఈవీఎంలోని స్లిప్పుల సంఖ్యకు తేడా ఉంటోందని, పోలైన ఓట్లలో కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరినట్లు ఆజాద్ చెప్పారు.ఈవీఎంలలో మరింత పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని ఈసీని కోరినట్లు ఆజాద్‌ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube