మహా పాదయాత్రకు మహా అడ్డంకులు ? అక్కడకు చేరుకోగానే ... ? 

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని,  మూడు రాజధానుల ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు అంటూ అమరావతి పరిసర ప్రాంత మహిళలు, రైతులు వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి  ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. అమరావతి జేఏసీ పేరుతో ఏడాదికి పైగా నిరసన దీక్షను సైతం కొనసాగించారు.

 Great Obstacles To The Great Walk On Reaching There ,ysrcp, Ap Government, Jagan-TeluguStop.com

అయినా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో దూకుడుగా ముందుకు వెళుతున్న క్రమంలో వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు.ఇక మహా పాదయాత్ర పేరుతో కోర్టు అనుమతులతో అమరావతి టు అరసవల్లి యాత్రను కొనసాగిస్తున్నారు.

గుంటూరు జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా కొనసాగింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ జిల్లాలో యాత్ర ప్రవేశిస్తుంది.

అయితే తూర్పుగోదావరి వరకు ప్రశాంతంగానే ఈ యాత్ర కొనసాగినా,  ఉత్తరాంధ్రలో అడుగుపెట్టగానే ఈ యాత్రకు అనేక అడ్డంకులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
  ఇప్పటికే ఈ యాత్రను అడ్డుకుంటామంటూ రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఏర్పాటైన జేఏసీ ప్రకటించింది అలాగే వైసిపికి చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు సైతం ఇదే ప్రకటన చేస్తున్నారు.

అలాగే ఈ నెల 15వ తేదీన విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా భారీ సభను నిర్వహించే ప్రయత్నంలో వైసిపి ఉంది.ఇక అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన యాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించగానే, దానిని అడ్డుకునేందుకు వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాటయింది.

వైసిపి ఆధ్వర్యంలోనే ఇదంతా చోటు చేసుకోబోతుండడంతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది.
 

Telugu Amaravathi Jac, Ap, Chandrababu, Jagan, Janasena, Janasenani, Maha Padaya

ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రకు టిడిపి, జనసేన, బిజెపిలు మద్దతు ప్రకటించాయి.ఇక వికేంద్రీకరణ కు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.అలాగే పాదయాత్రకు వ్యతిరేకంగా భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటయ్యాయి.

అయినా అమరావతి మద్దతు యాత్ర అగేదే లేదు అంటూ అమరావతి జెఏసి ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్ర పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube