గరికపాటిని వదిలే ప్రసక్తే లేదు.. వర్మ ట్వీట్స్ వైరల్?

మెగాస్టార్ చిరంజీవి పై గరికపాటి చేస్తున్న వ్యాఖ్యల వల్ల పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం మనకు తెలిసిందే.అందరి ముందు మెగాస్టార్ చిరంజీవిని అవమానకరంగా మాట్లాడటంతో గరికపాటి నరసింహారావు పై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Director Ram Gopal Varma Sensational Tweets On Garikapati Details, Garikapati,ve-TeluguStop.com

ఇకపోతే ఈ విషయంపై నాగబాబు స్పందించి గరికపాటిని అవమానపరచాలనేది మా ఉద్దేశం కాదని మెగా అభిమానులు ఎవరు కూడా ఈ విషయంపై ఆవేశ పడకూడదు అంటూ ట్వీట్ చేశారు.ఇక ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడుతుందని అందరూ భావించగా రాంగోపాల్ వర్మ తిరిగి ఈ విషయంపై స్పందిస్తూ సంచలనమైన ట్వీట్స్ చేశారు.

ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించి వరుస ట్వీట్లు చేస్తూ గరికపాటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ స్పందిస్తూ చిరంజీవిని అవమానించిన అతనిని వదిలే ప్రసక్తే లేదు.

మా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవిని అవమానించిన వారు గడ్డిపరకతో సమానం.గరికపాటి నువ్వు బుల్లి బుల్లి ప్రవచనాల్లో దాకో… పబ్లిసిటీ కోసం ఇండస్ట్రీపై మొరగద్దు అంటూ వరుసగా ట్వీట్లు చేశారు.

ఇక నాగబాబు చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ క్షమించండి నాగబాబు మెగాస్టార్ చిరంజీవి అవమానించిన గుర్రంపాటిని వదిలే ప్రసక్తే లేదు.మా దృష్టిలో ఎవరు చిరంజీవిని అవమానించిన వారు గడ్డిపరకతో సమానం.తగ్గేదేలే అంటూ వరుస త్వీట్లు చేస్తూ మరోసారి ఈ వివాదానికి వర్మ ఆజ్యం పోసారని తెలుస్తోంది.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేదా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube