సిబ్బంది సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు గతంలో పోలీస్ కోపరేటివ్ సొసైటీ నుండి తీసుకునే మూడు లక్షల లోను పరిమితిని 5 లక్షల వరకు పెంచడం జరిగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు.
ఈరోజు పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తమ సభ్యులతో కలసి పోలీస్ కమిషనర్ కార్యాలయం పోలీస్ కమిషనర్ గారిని కలిసి దీపావళి కానుకగా కోపరేటివ్ సొసైటీ లోను పరిమితి పెంచాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ కుటుంబ సభ్యుల అత్యవసర చికిత్స కోసం వెంటనే నగదు పొందే వెసులుబాటు, చదువులకు, ఆడపిల్ల వివాహం కోసం కూడా లోన్ వెంటనే పొందవచ్చని తెలిపారు.
సొసైటీలో లోన్ తీసుకుని, దుబారా చేసి కుటుంబాలను ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా పోలీస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగుఛ్చం అందజేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ జానిమియా, చక్రకళధర్ పాల్గొన్నారు.







