దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి నయనతార విగ్నేష్ దంపతులకు పండంటి మగ కవల పిల్లలు జన్మించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ దంపతులకి పిల్లల పుట్టిన విషయాన్ని విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని మీ ఆశీర్వాదం మా పిల్లలకు కావాలంటూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నయనతార విగ్నేష్ పెళ్లి జరిగి నాలుగు నెలలు అయినప్పటికీ ఈ దంపతులు పండంటి కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.
ఇకపోతే ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లికి ముందే సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను ప్లాన్ చేసుకున్నారని అర్థమవుతుంది.
ఈ క్రమంలోనే వీరి పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇకపోతే ఈ దంపతులు తన పిల్లల గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో నటి కాజల్ అగర్వాల్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా నయనతార దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.నయన్.వికీకి చాలా చాలా శుభాకాంక్షలు.పేరెంట్స్ క్లబ్‌లోకి మీకు ఆహ్వానం.కచ్చితంగా మీ జీవితంలో మీకు ఇది ఉత్తమ దశ అవుతుంది.ఉయిర్, ఉలగమ్ కు నా నుంచి ఎంతో ప్రేమ, దీవెనలంటూ కాజల్ అగర్వాల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక కాజల్ అగర్వాల్ సైతం ఏప్రిల్ నెలలో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా మాతృత్వాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నటువంటి కాజల్ అగర్వాల్ నయనతార దంపతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.







