ఇక బీఆర్ఎస్ అభ్యర్థులకూ సెక్యూరిటీ ! మండిపడుతున్న విపక్షాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే,  ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు భద్రత పెంచుతూ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.వీరితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులకు( BRS Leaders )  భద్రత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు .

 Government Increased Security For Brs Mlas And Mps Details, Brs, Telangana, Tela-TeluguStop.com

మెదక్ ఎంపీ బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై( Kottha Prabhakar Reddy ) రెండు రోజుల క్రితం కత్తి దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.కత్తితో ఎంపీ కడుపులో పొడవడంతో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కోలుకుంటున్నాను.ఈ కత్తి దాడి నేపథ్యంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచాలని నిర్ణయించుకున్నారు.

Telugu Ap, Brs Mlas, Brs Mps, Cm Kcr, Dubbaka Mla, Mpkotta, Raghunandan Rao, Tel

వీరితో పాటు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు భద్రతను కల్పిస్తూ ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్( Additional DG Anil Kumar ) ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నిర్ణయం పై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.భద్రత కల్పించే విషయంలో అందరికీ ఒకే రకమైన నియమం పాటించాల్సి ఉన్నా,  బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే అదనపు భద్రతను పెంచడంపై వారు మండిపడుతున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్యేలు , ఎంపీలకు 2+2 భద్రత ఉంది.కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన కత్తి దాడి నేపథ్యంలో దానిని 4+4 గా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

Telugu Ap, Brs Mlas, Brs Mps, Cm Kcr, Dubbaka Mla, Mpkotta, Raghunandan Rao, Tel

రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రత ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.ఈ వ్యవహారంపై విపక్ష పార్టీలు( Opposition Parties ) మండిపడుతున్నాయి .ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరిని ఒకేలా చూడాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ వారిని ఒకలా, విపక్ష పార్టీ వారిని మరోలా చూస్తూ ఉందని విమర్శిస్తున్నారు.భద్రత విషయంలో ఇంత వివక్షత ఎందుకని ప్రశ్నిస్తున్నారు.దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు( MLA Raghunandan Rao ) ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube