శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) శుభవార్త చెప్పింది.డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు విడుదల చేసింది.
డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు కొనసాగునున్న వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్ లో ఉంచినట్లు దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.భక్తులు ttddevasthanam.
ap.gov.in వెబ్సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని వెల్లడించారు.
అదే విధంగా మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.రోజుకు రెండు వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు 20,000 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తుంది.సాయంత్రం ఐదు గంటలకు వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచుతుంది.అంతే కాకుండా లోక సంక్షేమం కోసం తిరుణాచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Thirunachanur Sri Padmavati Ammavari ) దేవాలయంలో గురువారం లక్ష కుంకుమార్చన కన్నుల పండుగగా నిర్వహించారు.
పద్మావతి అమ్మవారి కార్తీక మహోత్సవాలు శుక్రవారం నుంచి మొదలయ్యాయి.ఉత్సవాలకు ముందు రోజు దేవాలయంలో కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది.
ఉదయం ఏడు గంటలకు ఉత్సవమూర్తిని వేచింపుగా ముఖ మండపానికి తీసుకొచ్చి పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చారు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు అమ్మవారికి పూజలు చేస్తారు.బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాగాలని కోరుతూ సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు.శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో అమ్మవారి కార్తీక మహోత్సవాలు ప్రారంభం అవుతాయి.
రాత్రి చిన్న శేష వాహన సేవ జరుగుతుంది.అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
బ్రహ్మోత్సవాలలో భాగంగా నవంబర్ 14వ తేదీన గజ వాహనం,15వ తేదీన స్వర్ణ రథం, గరుడ వాహనం 17వ తేదీన రథోత్సవం,18వ తేదీన పంచమి తీర్థం, 19వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారని తిరుమల దేవస్థానం చైర్మన్ వెల్లడించారు.
DEVOTIONAL