ఢిల్లీలో(Delhi) జరిగిన ఓ వింత సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.డ్రైవర్ లేకుండానే రోడ్ల మీద చక్కర్లు కొడుతున్న ఆటో రిక్షా వీడియో చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.‘ఢిల్లీ సే స్కై’(‘Delhi Say Sky’) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ గత డిసెంబర్‌లోనే ఈ వీడియోను అప్‌లోడ్ చేసినా, ఇప్పుడే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వీడియోలో ఆటో రద్దీగా ఉండే రోడ్ల మీదుగా వెళ్తుండటం కనిపిస్తుంది.
మొదటిసారి చూస్తే ఇది సాధారణ ఆటో రైడ్ వీడియోలాగే ఉంటుంది.కానీ కెమెరా(camera) సీట్లపైకి వెళ్లగానే అసలు విషయం బయటపడుతుంది, అది ఏంటంటే అక్కడ డ్రైవర్ లేడు.
ప్యాసింజర్లు లేకుండా ఆటో వెళ్లడం సాధారణమే కానీ, డ్రైవర్ లేకుండా(Without a driver) వెళ్లడం మాత్రం నిజంగా షాకింగ్.ఆ ఆటో ఎవరి కంట్రోల్ లేకుండానే దానంతట అదే ట్రాఫిక్‌లో తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ వింత సంఘటన రోడ్డు భద్రత గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది.అంతేకాదు, ఆన్‌లైన్‌లో రకరకాల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.కొంతమంది సోషల్ మీడియా యూజర్లు దీన్ని చూసి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఆ ఆటోకు “టార్జాన్: ది వండర్ రిక్షా” అని పేరు పెట్టారు.ఈ పేరు ‘టార్జాన్: ది వండర్ కార్’ (Tarzan: The Wonder Car)అనే సినిమానుంచి తీసుకున్నారు.ఆ సినిమాలో కారుకు మాయా శక్తులు ఉండి, అది తనంతట తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది.
మరికొందరు దీన్ని “దెయ్యాల ఆటో” (Demonic Auto)అంటున్నారు.
అయితే, ఈ మిస్టరీకి కొందరు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.ఆ ఆటోను వేరే వాహనంతో లాగుతూ ఉండొచ్చని కొందరు నెటిజన్లు అంటున్నారు.“ఆ ఆటోకు ఉన్న ఆకుపచ్చ కొమ్మను గమనించారా?” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.భారతదేశంలో వాహనం పాడైపోయి లాగుతున్నప్పుడు ఇలా కొమ్మలు కట్టడం సాధారణంగా కనిపిస్తుంది.
ఏదేమైనా, దీన్ని దెయ్యాల ఆటో అన్నా లేక ఇది లాగుతున్న ఆటో అయినా, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని, జోకులను క్రియేట్ చేస్తోంది.నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా చూసేయండి.