ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఏపీలో ప్రధాన పార్టీలు ప్రస్తుతం అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో మరొక మేనిఫెస్టో రూపకల్పనపై కూడా గట్టిగానే శ్రద్ధ పెట్టడం జరిగింది.ఇప్పటికే కొన్ని పార్టీలు హామీలు కూడా ప్రకటించాయి.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు( Chintakayala Ayyanna Patrudu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తన కుమారుడు విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో తన రాజకీయ వారసత్వాన్ని తన కొడుకు కొనసాగిస్తారని వ్యాఖ్యానించారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంటు( Anakapalli Parliament ) సెగ్మెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.

మరి అయ్యన్నపాత్రుడు అభ్యర్థన మేరకు టీడీపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.లోకేష్ పాదయాత్రలో చింతకాయల విజయ్( Chintakayala Vijay ) కీలకంగా వ్యవహరించారు.అంతేకాదు తండ్రి అయ్యన్నపాత్రుడుపై కేసులు పెట్టిన సమయంలో కూడా.
విజయ్ పోరాటం చేయడం జరిగింది.ఈ ప్రక్రియలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.
అయినా గాని ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.నారా లోకేష్ తో( Nara Lokesh ) కలిసి అనేక కార్యక్రమాలు సైతం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్.చింతకాయల విజయ్ నీ అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆదివారం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తన కొడుకు విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు వెల్లడించడం సంచలనంగా మారింది.