ఇంటర్​నెట్​ లేకున్నా.. యూపీఐ పేమెంట్స్​ చేయండిలా..!

భారతదేశంలోని వాణిజ్య రంగంలో వచ్చిన సాంకేతిక మార్పులు అత్యంత ఉపయోగకరంగా మారాయి.ఇండియాలోని ఏ నలుమూలలకి వెళ్లినా.

 Follow These Steps To Make Upi Payments Without Internet, Upi Transaction, Payme-TeluguStop.com

నగదు రహిత పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది.సైకిల్ మీద టిఫిన్లు అమ్మే వ్యక్తి నుంచి బంగారం విక్రేతల వరకు అన్నీ నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి.

దీనంతటికీ కారణం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నవంబర్‌, 2012లో ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్‌ “యూపీఐ” ను అందుబాటులోకి తీసుకురావడమే! మొదటగా ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ వ్యవస్థ ఇప్పుడు ఫీచర్ ఫోన్స్ వినియోగిస్తున్న వారికి కూడా అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుత డిజిటల్ వరల్డ్ లో కోట్లమంది ప్రజలు యూపీఐ పేమెంట్లు చేయడానికి బాగా అలవాటుపడ్డారు.

కానీ కొన్ని సందర్భంలో ఇంటర్‌నెట్‌ బ్యాలెన్స్‌ అయిపోవడమో లేదా నెట్‌వర్క్‌ కనెక్షన్ లేకపోవడం జరుగుతుంది.అలాంటి సమయంలో ఆఫ్‌లైన్‌లోనూ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వీలుంటే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

అయితే నిజానికి ఆఫ్‌లైన్‌లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇంటర్​నెట్​ అందుబాటులో లేకపోయినా మీరు లావాదేవీలు చేయొచ్చు.అదెలాగో ఇప్పుడు చూద్దాం.

• ఇంటర్​నెట్​ లేనప్పుడు మీరు చేయాల్సిందల్లా ముందుగా మీ ఫోన్‌లో ‘*99#’ అని టైప్‌ చేయాలి.

• తొలిసారిగా ఈ సేవలను వినియోగిస్తున్న వారైతే.మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి.

• తరువాత మీ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకోవాలి.కొన్ని సందర్భాల్లో ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ అడుగుతుంది.

దాని ప్రకారం, కోడ్‌ను ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.

Telugu Latest, Message Form, National India, Transfer, Upi-Latest News - Telugu

• ఈ రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే
1.send money,
2.Request money,
3.Check Balance,
4.My Profile,
5.Pending Requests,
6.Transactions ఇలా కొన్ని ఆప్షన్లు మీ స్క్రీన్ పై కనిపిస్తాయి.

• పైన కనిపిస్తున్న ఆప్షన్‌లలో మీకు కావాల్సిన ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.ఒకవేళ మీరు మనీ సెండ్ చేయాలి అనుకుంటే మొదటి ఆప్షన్ ఎంపిక చేసుకొని యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయాలి.

తరువాత చాలా ఈజీ స్టెప్స్ ఫాలో అయితే ట్రాన్సాక్షన్‌ విజయవంతమవుతుంది.ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మీరూ ఈ సింపుల్‌ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube