ఆర్ఆర్ఆర్ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం లో రాబోతున్న మరొక చిత్రం ఆర్ఆర్ఆర్.

 Fix For Rrr Teaser Release Date Fix, Rrr, Tollywood, Teaser Release Date, Rajamo-TeluguStop.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందిన విషయం అందరికి తెలిసిందే.ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు.

అజయ్ దేవ్ గన్, శ్రీయ, సముద్రకని ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు దర్శకుల గురించి భారీగానే స్పందన వచ్చింది.

అంతేకాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించి వేర్వేరు స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేసిన చిత్ర బృందం త్వరలోనే ఈ టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోందట.

Telugu Rajamouli, Teaser, Tollywood-Movie

లేటెస్ట్ బజ్ ఏమిటంటే ఈ సినిమా టీజర్ను దీపావళి సందర్భంగా అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారట.దీనిని జక్కన్న స్థాయి విజువల్స్ తో రెడీ చేస్తున్నారని సమాచారం.ఇక ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.అయితే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు చిత్ర బృందం కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube