కెనడాలో శాశ్వత నివాసం: ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో 3,600 మంది అర్హత

నవంబర్ 13న జరిగిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాలో ఎంపికైన 3,600 మందిని శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలని కెనడా ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది ఇప్పటి వరకు ఇన్విటేషన్స్ టూ అప్లయ్ ద్వారా 75,300 మంది కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిట్టమ్ కింద దరఖాస్తు చేసుకున్నారు.

 Express Entry Draw Invites 3600 Candidates Toapply-TeluguStop.com

సదరు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ కింద శాశ్వత నివాస దరఖాస్తులను ఫెడరల్ స్కిల్డ్ వర్కర్స్ క్లాస్, ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ క్లాస్ మరియు కెనడీయన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్‌లుగా వర్గీకరించారు.ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో అర్హత గల అభ్యర్ధులను కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ కింద ఇవ్వబడిన స్కోరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు.

Telugu Candis, Canadian, Express Invites, Telugau Nri Ups, Xpress-

వయస్సు, విద్య, నైపుణ్యం, వృత్తి అనుభవం మరియు ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులకు పాయింట్లు లభిస్తాయి.డ్రాలో అర్హత సాధించాలంటే 472 పాయింట్లను స్కోర్ చేయాల్సి ఉంటుంది.గతంలో ఇది 475గా ఉండేది.ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ నుంచి రెగ్యులర్ డ్రాల ద్వారా కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అత్యథిక ర్యాంక్ పొందిన అభ్యర్థులకు అవకాశం లభిస్తుంది.

ఈ ప్రక్రియ ప్రతి రెండు వారాలకు ఒకసారి నిర్వహిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube