నిల్వ ధాన్యం ఎగుమతి వేగవంతం చేయాలి

నల్లగొండ జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం ఎగుమతి( grain Export) ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.

బుధవారంనల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సల్కునూరు,భీమనపల్లి, ఆగామొత్కూరు, మాడుగులపల్లి కొనుగోలు కేంద్రాలోని ధాన్యాన్ని పరిశీలించి,రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ధాన్యం దిగుమతి విషయంలో కొర్రీలు చేపట్టకుండా రైస్ మిల్లర్లు సహకరించాలన్నారు.కొనుగోలు కేంద్రంలో రైతులకు( Farmers ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

Export Of Stored Grain Should Be Expedited , Nalgonda District , Farmers , Gra

ధాన్యం విషయంలో మిల్లర్లు అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిటి జావిద్, సహకార సంఘం అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారాలా.. అయితే మీరీ న్యాచురల్ ఫేస్ వాష్ వాడాల్సిందే!

Latest Nalgonda News