త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ! ఏపీ, తెలంగాణ నుంచి ఎవరెవరికంటే ..? 

త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ రాష్ట్రాల్లోని కీలక నాయకులకు మంత్రి పదవులను కేటాయించడం ద్వారా , వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతో కేంద్ర బిజెపి పెద్దలు ఉన్నారు.

 Expansion Of The Union Cabinet Soon! More Than Anyone From Ap And Telangana Tel-TeluguStop.com

ఈ మేరకు ఈనెల 12వ తేదీన లేదా 18వ తేదీన మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకున్నారట .ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amith shah ) , బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించినట్టు సమాచారం.ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో,  అప్పట్లోగా మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకున్నారట .రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి కొత్త క్యాబినెట్లో స్థానం కల్పించాలని నిర్ణయించుకున్నారట.

Telugu Amith Sha, Bandi Sanjay, Jp Nadda, Modhi, Narendra Mod, Telangana Bjp-Pol

ఈనెల 14న ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) ఫ్రాన్స్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో,  అప్పట్లో గా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారట.కేంద్ర మంత్రి వర్గ ప్రక్షాళన చేపట్టి,  పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించి త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో కీలక నాయకులకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారట.ఇప్పటికే కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్ , అర్జున్ రామ్ మెగ్వాల్,  భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఎస్ పి ఎస్ బగేల్, ప్రహ్లాద్ జోషి తదితరులు బిజెపి జాతీయ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ లు సమావేశం అయ్యారట .ప్రహ్లాద్ జోషి భూపేంద్ర యాదవ్ లకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారట .

Telugu Amith Sha, Bandi Sanjay, Jp Nadda, Modhi, Narendra Mod, Telangana Bjp-Pol

తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay Kumar ) కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట .బండి సంజయ్ మాత్రం తాను సాధారణ కార్యకర్తగానే కొనసాగుతానని తనకు కేంద్ర మంత్రి పదవి వద్దని పార్టీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చారట.ఒకవేళ సంజయ్ ఈ పదవి తీసుకోవడానికి నిరాకరిస్తే ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట .జివీఎల్  నరసింహారావు లేదా సీఎం రమేష్ లలో ఒకరికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నా,  ఇటీవల కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఇప్పుడు వినిపిస్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube