అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిన విషయమే.పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో చాలా మంది రీల్స్ చేశారు.
ఈ జాబితాలో బీజేపీ నేతలు కూడా ఉన్నారు.ఆనాడు ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ పలువురు కేంద్ర మంత్రులు ఈ డైలాగ్‌ను వాడుకున్నారు.
బీజేపీ అంటే కమలం.అందరూ తమను ఫ్లవర్ అనుకుంటున్నారని.
కానీ బీజేపీ అంటే ఫైర్ అని చెప్పుకున్నారు.కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయాలు నడుస్తున్నాయి.
ఎందుకంటారా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వస్తుంది కదా.అందుకే వైసీపీ, బీజేపీ నేతలు తమ నోటికి పని చెప్తున్నారు.తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.పువ్వు అంటే ఫ్లవరే అంటూ కమలం పార్టీ పరువు తీసేశారు. పువ్వు పార్టీ ఎగేసుకుని వచ్చి ఏపీలో ఏం చేసిందని బిగ్ క్వశ్చన్ కూడా రైజ్ చేశారు.పువ్వు పార్టీ ఏపీ జనాల చెవుల్లో నిజంగానే పువ్వు పెట్టిందని హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అంటూ పేర్ని నాని బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు.జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కట్టించాల్సిన కేంద్ర ప్రభుత్వం తాము చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడమేనా ఏపీకి చేసిన మేలు అంటూ నిలదీశారు.
తాము విపక్షాల గొంతు నొక్కుతున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్న జేపీ నడ్డా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2,400 కోట్ల దాకా వైసీపీ సర్కార్ ఖర్చు చేస్తోందని.మరి కేంద్రం ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వంతున ఇస్తున్నామని జేపీ నడ్డా చెప్పడం సిగ్గుమాలిన తనం అనిపించడం లేదా అంటూ పేర్ని నాని కడిగేశారు. ఏపీకి ఉన్న అప్పు ఎంత.
కేంద్రం ఇస్తున్న నిధులు ఎంత అన్న విషయంపైనా జేపీ నడ్డా మాట్లాడితే బాగుండేదని పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు.మరి కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అని.కేంద్రం అప్పు ఏకంగా 53 లక్షల కోట్ల నుంచి 130 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.మొత్తం మీద కమలం పార్టీ తీరుపై పేర్ని నాని ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.