ఆ పార్టీలో చేరాలని ఉన్నా... మొహమాటపడుతున్న జేడీ !?

సిపిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో వివి లక్ష్మీనారాయణ చూపించిన చొరవ,  ఆయన దర్యాప్తు తీరు ఇవన్నీ ఆయనకు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతలు సంపాదించిపెట్టాయి.ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరుపై ఆయనకు ప్రశంసలు దక్కాయి.

 Even If You Want To Join That Party A Smiling Jedi! , Jd Lakshminarayana, Cbi Jd-TeluguStop.com

ఇక ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుని రాజకీయాల వైపు లక్ష్మీనారాయణ అడుగులు వేశారు.చాలా కాలం పాటు ఏ పార్టీలో చేరాలో తెలియక గందరగోళానికి గురయ్యారు.

సొంత పార్టీ పెడతారని ప్రచారం జరిగింది.కానీ చివరకు 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.
 

Telugu Ap, Cbi Jd, Congress, Pavan Kalyan, Visakha Mp, Ysrcp-Political

 ఇక తర్వాత జనసేన లో యాక్టివ్ గానే కనిపించినా,  చివరకు పవన్ వైఖరి నచ్చక లక్ష్మీనారాయణ జనసేనకు  రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు.సొంతంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు .2019 ఎన్నికల్లోను మళ్ళీ ఎంపీగా పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో లక్ష్మినారాయణ ఉన్నారు.అయితే సొంతంగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు.

అందుకే ఆ సాహసం చేసేందుకు ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తి చూపించడం లేదు.పోనీ టిడిపిలో చేరదామా అంటే గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో టిడిపి తో తనకు సంబంధాలు ఉన్నాయన్నట్లుగా వైసిపి చేసిన విమర్శలు లక్ష్మీనారాయణకు గుర్తుకొస్తున్నాయి.

  ఎలాగూ వైసీపీలో చేరే అవకాశం లేదు.చివరి ఆప్షన్ గా ఆయనకు జనసేన కనిపిస్తోంది.
 

Telugu Ap, Cbi Jd, Congress, Pavan Kalyan, Visakha Mp, Ysrcp-Political

 కచ్చితంగా జనసేన నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాననే నమ్మకంతో లక్ష్మీనారాయణ ఉన్నారు.అయితే తనకు తానుగా మళ్లీ జనసేన లో చేరుతానని లక్ష్మీనారాయణ  అడగలేకపోతున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జేడిని  రమ్మని పిలిపించే ప్రయత్నము ఎలాగూ చేయరు.దీంతో లక్ష్మీనారాయణ  రాజకీయ జీవితం సందిగ్ధం లో పడింది.ఇటీవల రణస్థలంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువ భేరీ సభ పై లక్ష్మీనారాయణ స్పందించారు.రణస్థలంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో యువకులు ముందుకు వచ్చి తమ గళాన్ని వినిపించడం చాలా సంతోషకరమంటూ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ఈ విధంగా జనసేనకు సానుకూలంగా ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆ పార్టీలో చేరుతానని నేరుగా పవన్ ను అడిగే ప్రయత్నం ఆయన చేయలేకపోతున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube