రాజీనామా విషయంలో వెనక్కు తగ్గిన ఈటెల... అసలు కారణం ఇదే

తెలంగాణలో ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపణలు రేపుతోంది.ఇప్పటికే ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

 Etela Backed Down In Case Of Resignation  This Is The Real Reason Kcr, Etela Raj-TeluguStop.com

అదే విధంగా దేవరయాంజల్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఈటెల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ కమిటీ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది.

అయితే ఈటెలను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన తరువాత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అయితే ఆ తరువాత తన స్వరం పెంచిన ఈటెల ఇక నియోజకవర్గం స్థాయి నేతలతో, అదే విధంగా ముదిరాజ్ నేతలతో, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అవడంతో ఈటెలపై కొత్త పార్టీ పెట్టబోతున్నాడా అనే చర్చ మొదలైంది.

అయితే ఈ పరిణామాలన్నీ చూసిన తరువాత ఇక ఈటెల త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.అయితే ఒకానొక దశలో ఎమ్మెల్యే పదవికి ఈటెల కూడా సిద్దపడ్డాడని తెలిసింది.

కాని ఎమ్మెల్యే పదవికి ఇప్పటికప్పుడు రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం లేదని ఈటెల అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.అయితే రాజీనామా చేసినా ఎన్నికల సంఘం ఇప్పుడు ఎన్నికలు జరపక పోవచ్చని, అలా అయితే నియోజకవర్గంలో రాజీనామా వేడి తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కోవిడ్ విజృంభణ తగ్గిన తరువాత రాజీనామాపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube