అవ్వా.. ఇదెక్కడి విడ్డురం: నగ్నంగా ఏనుగుపై ఎక్కిన యువతి...!

అడవుల్లో తిరిగే ఏనుగులు ఒక్కసారిగా మానవ ప్రపంచంలోకి వస్తే వాటిని చూడడానికి ఎంతో మంది ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అలాగే ఆ ఏనుగు మీద అంబారీ ఎక్కి ఊరంతా ఊరేగాలని అనుకునే వారు కూడా ఉంటారు.

 Elephant, Viral Latest, Viral News, Soical Media, Netizens Comments,bold Photosh-TeluguStop.com

అయితే రష్యాలోని యువతికి కూడా ఏనుగు మీద ఎక్కాలని కోరిక పుట్టింది.అనుకున్నదే తడువుగా ఏనుగు ఎక్కేసింది.

అయితే, ఇందులో ఆశ్చర్యం ఏమి ఉంది.?! ఏనుగు ఎక్కితే ఇదేమన్నా పెద్ద గొప్ప విషయమా అని అనుకుంటున్నారా.? అయితే ఆ ఏనుగు మీద ఎక్కిన యువతీ కనీసం ఒంటి మీద నూలుపోగు కూడా ఉంచుకోకుండా నగ్నంగా ఏనుగు ఎక్కి దానిమీద పడుకుంది.

అసలు వివరాల్లోకి వెళితే.

రష్యాకు చెందిన అలెస్య కఫెల్కికోవా అనే మోడల్ నగ్నావతారంలో సుమత్రా ఏనుగు మీదీకి ఎక్కింది.ఎక్కితే ఎక్కింది.

అదేదో గొప్ప ఘనకార్యం చేసినదానికి మల్లె ఈ ఘనకార్యాన్ని అంతా వీడియో తీసి తన ఇన్స్ట్రాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది.ఆ వీడియో చూసి జంతు ప్రేమికులు తిట్ల దండకం మొదలుపెట్టారు.

అంతేకాదు ముందు ఏనుగు మీది నుంచి కిందికి దిగు, నీ నగ్న ఫొటో షూట్లు, వీడియోలకు ఇంకేదైనా మార్గం వెతుక్కో, మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా.? నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఇక్కడ ఎవరైనా ఖాళిగా కూర్చున్నారా.? ఏంటా పిచ్చి వేషాలు.అంటూ తెగ మండిపడ్డారు.

ఈ కామెంట్స్ చూసి చూసిన ఆమె వెంటనే ఆ వీడియోను తీసేసింది.అంతేకాదు ఏనుగులంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఇలాంటి ఫొటోషూట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.తన ఫొటో అభ్యంతరంగా అనిపించినందుకు క్షమాపణలు చెప్పింది.ఇంతకీ ఈమె ఎవరు అనుకున్నారు.

ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు యెవ్ గెనీ కఫెల్నికోవ్‌ కూతురే ఈ అలెస్య.మొత్తానికి ఏదో చేద్దామని అనుకుని అందరిలో నవ్వుల పాలు అయింది అలెస్య.

ఆలస్యంగా అయిన అలెస్య తను చేసిన పొరపాటు తెలుసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube