Laura Trump : అమెరికా : రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో చైర్‌గా ట్రంప్ కోడలు లారా .. నెటిజన్ల ట్రోలింగ్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు లారా ట్రంప్( Laura Trump ) ‘‘రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ) కో చైర్ ’’ పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా సూపర్ ట్యూస్‌డే‌లో రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్‌గా అవతరించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రిపబ్లికన్ నేషనల్ కమిటీలో గట్టి పట్టు సాధించారు.

 Donald Trumps Daughter In Law Lara Faces Backlash As Shes Elected As Rnc Co Cha-TeluguStop.com

శుక్రవారం.ట్రంప్ మిత్రులు ఆర్‌ఎన్‌సీలో అధికారికంగా అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.

మైఖేల్ వాట్లీని చైర్‌గా ట్రంప్ కోడలు సారా ట్రంప్‌ను కో చైర్‌గా రిపబ్లికన్ కమిటీ ఎన్నుకుంది.ఈ ఇద్దరు అభ్యర్ధులను ట్రంప్ గతంలో ఎండార్స్ చేశారు.

Telugu Donald Trumps, Donaldtrumps, Laura Trump, Michael Whatley, Rnc Chair, Ron

నార్త్ కరోలినా రిపబ్లికన్ పార్టీ అధిపతిగా వున్న మైఖేల్ వాట్లీ( Michael Whatley ).2017 నుంచి ఆర్ఎన్‌సీ చైర్‌వుమెన్‌గా పనిచేసిన రోన్నా మెక్‌డానియల్ ( Ronna McDaniel )స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.ట్రంప్ సహచరులు తనను తొలగించాలని ఒత్తిడి చేయడంతో ఆమె గత నెలలో పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు.వీడ్కోలు ప్రసంగంలో కంటతడి పెట్టిన డానియల్.ట్రంప్ ఆర్ఎన్‌సీలో తాను కోరుకున్న మార్పును పొందేందుకు అర్హులని వ్యాఖ్యానించారు.నవంబర్‌లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తానని డానియల్ తెలిపారు.

శుక్రవారం జరిగిన కార్యక్రమంలో లారా ట్రంప్.తన మామగారికి మద్ధతును ప్రకటించారు.

డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) తిరిగి ఎన్నుకోవడం, సెనేట్‌ను తిప్పికొట్టడం, సభను విస్తరించడం తన లక్ష్యాలని లారా ట్రంప్ చెప్పారు.

Telugu Donald Trumps, Donaldtrumps, Laura Trump, Michael Whatley, Rnc Chair, Ron

మరోవైపు లారాను ఆర్ఎన్‌సీ కో చైర్‌గా ఎన్నుకోవాలని కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం ఆన్‌లైన్‌లో దుమారం రేపింది.లారాను నామినేట్ చేసిన స్పీకర్ ప్రసంగం వైరల్ కావడంతో.నెటిజన్లు ఆమె ఈ పదవికి ఎందుకు అనర్హురాలో చెబుతూ పోస్ట్‌లు పెట్టారు.

లారా ఎంపిక .రిపబ్లికన్ పార్టీపై తన పట్టును పెంచడంతో పాటు 2024 అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ట్రంప్ వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచానన్న ట్రంప్ తప్పుడు వాదనలకు వాట్లీ మద్ధతు పలికిన సంగతి తెలిసిందే.లారా ట్రంప్, మైఖేల్ వాట్లీలు నార్త్ కరోలినాకు చెందిన వారే కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube