అత్తి పండ్లు… ఈ పండ్లు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందో అని అనుకుంటున్నారా…? ఇదేం కొత్త పండు కాదండోయ్.మనకు మార్కెట్లో లభించే అంజీర పండ్లనే అత్తిపండ్లు అని కూడా పిలుస్తారు.
ఈ పండ్లను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు.అంజీర పండును ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత తీసుకోవాలి అంజీర పండు అది శరీరానికి ఎంతో ఆరోగ్య వరంగా ఉపయోగపడుతుంది.
ఇక ఈ అంజీర పండ్లు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి.వీటిని సాంప్రదాయ ఔషధంగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
అలాగే వాటిని డ్రైఫ్రూట్స్ రూపంలో కూడా ఉపయోగిస్తారు.వీటిని వాడడం వల్ల శరీరంలోని రక్తపోటును చాలా బాగా నియంత్రించవచ్చు.
అలాగే ఎండిన అంజిరా పండ్లను తినడం ద్వారా అందులో లభించే కాల్షియం, అలాగే ఫైబర్ వల్ల శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.అంతేకాదు మలబద్ధకం సమస్య ఉన్న సమయంలో వీటిని తీసుకోవడం చాలా చాలా వరకూ ఉపశమనం పొందవచ్చు.
ఇలా మలబద్ధక సమస్యలను దూరం చేసుకోవాలంటే రాత్రి పడుకునే ముందు ఒక మూడు లేదా నాలుగు పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని తీసి తేనెతో కలిపి తినడం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇక చాలామంది పెద్దలు ఈ అంజీర పండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త శాతం పెరుగుతుందని చెబుతుంటారు.
కొన్ని పరిశోధనలలో ఇది నిజం అని కూడా తేలింది.ఇక అలాగే ఈ పండ్లలో ఉండే పెక్టిన్ అనే విచిత్రమైన ఫైబర్ కలిగి ఉండడం ద్వారా ఇది శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ పండ్లను తినడం ద్వారా రక్తం శుభ్రం కావడంతో గుండెకు సంబంధించిన వ్యాధులను చాలావరకు తగ్గించేస్తుంది.వీటిని తినడం ద్వారా శరీరంలో ఇన్స్టంట్ ఎనర్జీ ని పొందవచ్చు.
దీనికి గల కారణం ఆ పండులో దొరికే కార్బోహైడ్రేట్లు అలాగే చక్కెర లాంటి పదార్థాలు ఉండటం ద్వారా అవి శరీరంలో తొందరగా శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి.