నారదుడు విష్ణు మూర్తి ని ఎందుకు శపించాడో తెలుసా?- Do You Know Why Narada Cursed Vishnu

do you know why narada cursed vishnu, narada, vishnu, Narada cursed Vishnu, స్వయంవరం - Telugu Narada, Narada Cursed Vishnu, Vishnu, స్వయంవరం

నారదుడు సాక్షాత్తు ఆ నారాయణుడికి పరమ భక్తుడు అని అందరికీ తెలిసినదే.ఎల్లప్పుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ముల్లోకాలు సంచరిస్తు సమాచారాన్ని ఇటు, ఆటూ చేరవేస్తూ ఎన్నో సమస్యలకు కారకుడు అవుతుంటాడు.

 Do You Know Why Narada Cursed Vishnu-TeluguStop.com

నారాయణుడికి పరమభక్తుడైన నారదుడు సాక్షాత్తు ఆ నారాయణుడిని ఎందుకు శపించాడు? అలా నారదుడు నారాయణుడిని శపించడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

నారదుడు భగవంతుని స్మరణలో మునిగిపోతే అతనిని కామ దేవుడు కూడా కదిలించలేక పోయాడు.కామదేవుడు సాక్షాత్తు ఆ పరమశివుడు అంతటి వాడి ధ్యానాన్ని చెడగొట్టాడు, కానీ ధ్యానాన్ని చెడు కొట్టలేకపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా నారదుడిలో శివుడి కంటే నేనే గొప్పవాడినని అహంకారం పెరిగిపోయింది.

 Do You Know Why Narada Cursed Vishnu-నారదుడు విష్ణు మూర్తి ని ఎందుకు శపించాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నారదుడిలో పెరిగిపోయిన ఈ అహంకార భావం వల్ల వస్తున్న మార్పులను గమనించిన నారాయణుడు ఎలాగైనా నారదుడికి బుద్ధి చెప్పాలని భావించి తన సతి అయిన లక్ష్మీదేవిని భూలోకానికి పంపుతాడు.

భూలోకంలో అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అంబరీషుడు అనే రాజుకు లక్ష్మీదేవి జన్మిస్తుంది.

ఆమెకు శ్రీమతి అనే పేరును పెట్టీ ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు.ఒకసారి నారదుడు లోకసంచారం చేస్తూ అంబరీషుడి అంతఃపురానికి చేరుకొని అక్కడ శ్రీమతి అందానికి ముగ్ధుడైపోయి ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని భావిస్తాడు.

అదే విషయాన్ని అంబరీషుడు దగ్గర నారదుడు తెలియజేస్తాడు.

నారదుడి మాటలు విన్న అంబరీషుడుతన కూతురికి స్వయంవరం ప్రకటిస్తానని, అందులో నా కూతురు మిమ్మల్ని ఇష్టపడితే తప్పకుండా వివాహం చేస్తానని చెబుతాడు.స్వయంవరంలో రాజకుమారి తననే వరిస్తుందని నమ్మకం ఏమిటి అనే అనుమానం కలగడంతో సాక్షాత్తు ఆ పరమశివుడు దగ్గరికి వెళ్లి తగిన ఉపాయాన్ని సూచించమని సలహా అడుగుతాడు.నారదుడికి వచ్చిన అనుమానానికి చిరునవ్వు నవ్వి నారాయణుడిని మించిన అందగాడు ఎవరుంటారు.

నువ్వు కనుక ఆ విష్ణుమూర్తి అంత అందంగా కనిపిస్తే తప్పకుండా రాజకుమారి నిన్నే వివాహం అవుతుందని సలహా ఇస్తాడు.

వైకుంఠానికి వెళ్లి జరిగిన విషయం మొత్తం నారాయణుడికి తెలుపగా, స్వయంవరం రోజు రాజకుమారి నన్ను చూడగానే మీ అందం కనిపించేలా ప్రసాదించండి అని అడుగుతాడు అందుకు చిరునవ్వు నవ్విన విష్ణు మూర్తిని చూసి అది తన నిర్ణయం అని భావించి అక్కడి నుంచి స్వయంవరానికి బయలుదేరుతాడు.

స్వయంవరంలో రాజకుమారి నారదుని చూడగానే ఆమెకు అందరి మధ్య సన్యాసిలో ఉన్న ఒక కోతి మొహం కనిపించడంతో ఆమె భయపడి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతోనే అసంకల్పితంగా ఆయన మెడలో దండ వేసి అక్కడినుంచి మాయమైపోయారు.ఇదంతా చూసిన నారదుడికి ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడినుంచి బయట నీటి కొలను దగ్గరకు వెళ్ళగానే ఆ నీటిలో తనకి ఉన్న కోతి మొహం కనిపిస్తుంది.

ఈ విషయాన్ని గ్రహించిన నారదుడు పట్టరాని కోపంతో తాను ప్రేమించిన స్త్రీని తనకు దూరం చేసినందుకు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి కూడా సతీ వియోగం కలుగుతుందని శపించాడు.అంతేకాకుండా ఒక కోతి కారణంగానే వీరిరువురు కలసుకుంటారని విష్ణుమూర్తికి శాపం పెట్టాడు.

#Narada #NaradaCursed #Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU