ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ( JanaSena Party ) ఎంత కీలకంగా మారిందో మన అందరం చూస్తూనే ఉన్నాం.ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం కింగ్ మేకర్ స్థానం లో ఉన్నాడు.
ఆయన మీదనే ప్రభుత్వ మార్పిడి ఆధారపడి ఉంది.నిన్న మొన్నటి వరకు రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగా ఓపిస్తారా , లేదా పొత్తు వస్తారా అనే విషయం పై స్పష్టమైన క్లారిటీ ఉండేది కాదు.
కానీ రీసెంట్ గానే ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) అయినా సందర్భంగా, రాజముండ్రి జైలులో పరామర్శకు వెళ్ళినప్పుడు కూటమి ని అధికారికంగా ప్రకటించాడు.రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన పార్టీ లు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాయి, బీజేపీ పార్టీ కూడా మాతో కలుస్తుందని ఆశిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
అయితే జనసేన పార్టీ( JanaSena Party ) కి ఈసారి వచ్చే ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తు ఉంటుందా లేదా అనే సందిగ్ధం కార్యకర్తల్లో ఉండేది.అయితే నేడు ఎన్నికల సంఘం జనసేన పార్టీ కి గాజు గ్లాస్ గుర్తు ఖరారు చేసింది అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో అధికారికంగా తెలిపాడు.2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో 134 స్థానాల్లో పోటీ చేసింది.ఈ 134 స్థానాలకు కలిపి జనసేన పార్టీ కి 23 లక్షల ఓట్లు, 7 శాతం వోట్ షేర్ వచ్చింది.కానీ సీట్స్ మాత్రం కేవలం ఒక్కటే వచ్చింది.
ఎన్నికల సంగం రూల్స్ ప్రకారం, ఒక ప్రాంతీయ పార్టీ కి ఒకే గుర్తు ఉండాలి అంటే కచ్చితంగా రెండు నుండి మూడు సీట్లు, అలాగే 7 శాతం కి పైగా వోట్ షేర్ రావాలి.అప్పుడే కామన్ సింబల్ ఉంటుంది.
కానీ జనసేన పార్టీ కి కేవలం ఒకే ఒక్క స్థానం వచ్చింది.
దీంతో వచ్చే ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తు ఉంటుందా ఉండదా అని అభిమానులు మరియు కార్యకర్తలు భయపడ్డారు.ఇప్పుడు అలాంటి వారికి ఈ వార్త ఎంతో ఉపశమనం కల్పించింది అనే చెప్పాలి. ఈ గాజు గ్లాస్ గుర్తు పోకుండా ఉండడానికి జనసేన పార్టీ లీగల్ టీం పెద్ద యుద్ధమే చేసింది.
అందుకు సంబంధంచిన కార్యక్రమాలు మొత్తం జరపడానికి దాదాపుగా 5 కోట్ల రూపాయిల వరకు ఖర్చు అయ్యిందని అంటున్నారు.గత ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు జనాల్లోకి బలంగా వెళ్ళలేదు.
అందువల్ల కోస్తాంధ్ర తప్పిస్తే మిగిలిన ప్రాంతాలలో ఈ పార్టీ కి డిపాజిట్స్ కూడా రాలేదు.కానీ ఇప్పుడు ఈ పార్టీ గుర్తు జనాల్లోకి బలంగా వెళ్ళింది.
సరైన ప్రణాళిక తో ఎన్నికల ప్రచారం చేస్తే ఈసారి జనసేన పార్టీ దుమ్ములేపేస్తుందని అంటున్నారు అభిమానులు.